అక్కినేని నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కల్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో నాగ్ సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి నటించారు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా ‘బంగార్రాజు’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.. అయితే ‘బంగార్రాజు’లో మాత్రం మరో హీరోయిన్‌కి ఛాన్స్ లేదని తెలుస్తోంది. సోగ్గాడే చిన్నినాయన కథకి పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. దీంతో లావణ్య పాత్రకి అవకాశం లేనట్టుగా సమాచారం. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది.