నటి సమంత, జీవితంలో ఎన్ని ఆటుపోట్లు, అడ్డంకులు ఎదురైనా, తన ప్రొఫెషనల్ విషయంలో చాలా క్లారిటీతో వ్యవహరిస్తుంటారు. తాజాగా, ఆమె తీసుకున్న నిర్ణయం గురించి సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. పెళ్లి తర్వాత ఆమె హనీమూన్‌కు వెళ్లకుండా నేరుగా షూటింగ్‌లో పాల్గొనడంపై కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు ట్రోలింగ్ చేస్తున్నారు. పెళ్లయిన నాలుగో రోజుకే సమంత తిరిగి షూటింగ్‌లో పాల్గొనడం హాట్ టాపిక్‌గా మారింది. “పెళ్లి పెళ్లే.. యాక్టింగ్ యాక్టింగే” అంటూ ఆమె హనీమూన్ ట్రిప్‌ను వాయిదా వేసుకుని, భర్త రాజ్ తో కలిసి సెట్స్‌పైకి వచ్చారు. సమంత ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. తాజాగా, మేకప్ రూమ్‌లో దర్శకురాలు నందిని రెడ్డితో కలిసి దిగిన ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Also Read :November Tollywood: చిన్న సినిమాల హవా, మూడు మాత్రమే బ్రేక్ ఈవెన్
సమంత ప్రొఫెషనలిజాన్ని ప్రశంసిస్తున్నా, హనీమూన్‌కు వెళ్లకపోవడంపై ఆమెకు కామెంట్స్ తప్పడం లేదు. ప్రశంసించే వారి వాదన (ఫ్యాన్స్) ప్రకారం పెళ్లయినా కెరీర్‌కు ప్రాధాన్యత ఇవ్వడాన్ని మెచ్చుకుంటున్నారు. || విమర్శించే వారి వాదన (యాంటీ ఫ్యాన్స్) వాదన ప్రకారం స్వార్థం/పరిస్థితి: సొంత సినిమా (మా ఇంటి బంగారం) కావడంతోనే, నిర్మాణ పనుల కోసం వచ్చిందంటున్నారు. ప్రస్తుతం సమంత, నటనతో పాటు నిర్మాతగానూ యూటర్న్ తీసుకున్నారు. ‘ఖుషీ’ తర్వాత తెలుగులో పెద్దగా ఆఫర్స్ లేవని యాంటీ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్న తరుణంలో, ఆమె నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.
* ‘శుభం’ చిత్రంతో నిర్మాతగా తొలి అడుగు వేసిన సమంత, ఆ తర్వాత రెండో సినిమాగా ‘మా ఇంటి బంగారం’ను నిర్మిస్తున్నారు.