జాతీయ స్థాయిలో స్పెషల్ జ్యూరీ అవార్డులను రెండుసార్లు అందుకున్నాడు నటుడు అనుపమ్ ఖేర్. 37 సంవత్సరాలలో వివిధ భాషల్లో 518 సినిమాలలో నటించాడు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకు ఛైర్మన్ గా పనిచేశారు. పద్మశ్రీ , పద్మభూషణన్ పురస్కారాలను అందుకున్నారు. ఆయన ప్రధాన పాత్ర పోషించిన హిందీ సినిమా ‘సారాంశ్’ 37 సంవత్సరాల క్రితం మే 25న విడుదలైంది. ఆ రోజుల్ని తలుచుకుంటూ అనుపమ్ ఖేర్ ఇన్ స్టాగ్రామ్ లో […]
వైవిధ్యమైన చిత్రాలతో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు సుమంత్. అతని తాజా చిత్రం ‘అనగనగా ఒక రౌడీ’ మను యజ్ఞ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రాన్ని గార్లపాటి రమేష్, డా. టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. సుమంత్ కెరీర్‌లో ఇదొక వైవిధ్యమైన చిత్రమని, ఆయన పాత్ర రొటిన్‌కు భిన్నంగా వుంటుందని, కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఆ పాత్ర తప్పకుండా నచ్చుతుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. […]
హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’. అందులో వచ్చే నెల జూన్ 4న టొవినో థామస్ కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవెయిటెడ్ యాక్షన్ డ్రామా ‘కాలా’ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. ఓ హింసాత్మక ఘటనలో చనిపోయే కుక్క కారణంగా ఇద్దరి వ్యక్తుల మధ్య ఆసక్తికరమైన భావోద్వేగాలతో నడిచే కథే ‘కాలా’. టొవినో థామస్, సుమేష్ మూర్, దివ్యా పిళ్లై, లాల్ […]
‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అనేది తెలుగులో సూపర్ హిట్ డైలాగ్! అయితే, బాలీవుడ్ స్టార్ అక్షయ్ విషయంలో అది అక్షరాలా నిజం! గత 30 ఏళ్లుగా ఆయన అద్భుతంగా ఎదుగుతూ వచ్చాడు. యాక్షన్ స్టార్ నుంచీ ఇప్పుడు నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ గా ఎదిగాడు. అయితే, ఈ క్రమంలో ఆయన ఖాతాలో ఎన్నో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్స్ పడ్డాయి. కానీ, అదే సమయంలో మన ఖిలాడీ మిస్సైన సూపర్ మూవీస్ కూడా కొన్ని ఉన్నాయి…‘బాజీగర్’ […]
వరుస పరాజయాలతో ఎంతో కాలంగా ప్రయాణం చేస్తున్న ‘అల్లరి’ నరేశ్ కు చెప్పుకోదగ్గ విజయాన్ని అందించింది ‘నాంది’ చిత్రం. ఈ కోర్ట్ డ్రామా విమర్శకుల ప్రశంసలు పొందడమే కాదు… సాధారణ ప్రేక్షకుడిలోనూ ఓ ఉత్సుకతను కలిగించింది. నటుడిగా నరేశ్ ను మరో మెట్టు పైన నిలిపింది. థియేటర్లలోనే కాకుండా ఆ తర్వాత ఆహా లో స్ట్రీమింగ్ అయినప్పుడు కూడా అదే ఆదరణ ఈ చిత్రానికి లభించింది. ఇక ఇప్పుడు ఈ నెల 30న ఈ సినిమాను జెమినీ […]
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ట్రిపుల్ ఆర్’ ను వరల్డ్ వైడ్ గా పంపిణీ చేసే విషయంలో ఎవరెవరి పాత్ర ఏమిటనే విషయంలో కొంత క్లారిటీ వచ్చింది. దక్షిణాది భాషల థియేట్రికల్ రిలీజ్ విషయంలో దర్శక నిర్మాతలు ఇంకా గోప్యత పాటిస్తున్నా, ఈ సినిమాను హిందీలో పంపిణీ చేస్తున్న పెన్ స్టూడియోస్, పెన్ మరుధర్ సినీ ఎంటర్ టైన్ మెంట్స్ మాత్రం ఓ స్పష్టతను ఇచ్చేశాయి. పాన్ ఇండియా […]
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ను స్థాపించి 2005 నుండి పలు చిత్రాలను నిర్మిస్తూ, నటిస్తున్నాడు నందమూరి హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్. అంతేకాదు… తన తమ్ముడు ఎన్టీఆర్ తోనూ ఆ బ్యానర్ లో ‘జైలవకుశ’ చిత్రాన్ని నిర్మించాడు. త్వరలో తెరకెక్కబోతున్న ఎన్టీయార్ – కొరటాల శివ చిత్రానికి, ఆ తర్వాత వచ్చే ఎన్టీయార్ – తివిక్రమ్ సినిమాలకు కూడా కళ్యాణ్ రామ్ సమర్పకుడిగా వ్యవహరించబోతున్నాడు. ఇదే సమయంలో నటుడిగానూ కళ్యాణ్ రామ్ ఇప్పుడు వేగం పెంచాడు. 2020లో […]
తల్లిదండ్రులు భౌతికంగా దూరమైనా… ప్రతి రోజు మనం చేసే పని, ప్రవర్తనతో వారిని తలుచుకుంటూనే ఉంటాం. గాన గాంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కన్నుమూసి ఎనిమిది నెలలు గడిచిపోయింది. అయినా ఇవాళ్టికీ కోట్లాది మంది పెదవులపై ఆయన పాడిన పాటలు అనునిత్యం పల్లవిస్తూనే ఉన్నాయి. అయితే… ఆయన లేని లోటును ఎక్కువగా ఫీల్ అయ్యేది ఖచ్చితంగా ఆయన కుమారుడు ఎస్పీ చరణే! అతను ఏం చేసినా… తండ్రి ఉన్నప్పుడు – లేనప్పుడు అందులో వ్యత్యాసాన్ని బాగా పోల్చుకుంటున్నట్టు […]
‘రామానంద్ సాగర్’… ఈ పేరు చెప్పగానే ఏం గుర్తుకు వచ్చింది? అసలు రామానంద్ సాగర్ ఎవరో, ఎట్లా ఉంటాడో తెలియకున్నా ఆయన రూపొందించిన ‘రామాయణం’ మాత్రం జ్ఞాపకం వచ్చే ఉంటుంది! దూరదర్శన్ లో ఆయన తెరకెక్కించిన రామకథ ప్రసారం అవుతుంటే వీధులన్నీ ఖాళీ అయిపోయేవట! తరువాతి కాలంలో రామానంద్ సాగర్ అంటే రామాయణానికి మారుపేరు అయిపోయాడు! ఇప్పుడాయన గురించి మనం మాట్లాడుకోవటానికి కారణం ఆయన ముని మనవరాలే…సాక్షి చోప్రా… ఈమెవరు అంటే ఇన్ స్టాగ్రామ్ లోని యాక్టివ్ […]
మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కరోనా బాధితుల కోసం ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలోని చాలా జిల్లాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆయన ఇటీవల తెలిపారు. ఈ మేరకు తొలి విడతగా గుంటూరు, అనంతపురం జిల్లాలకు ఆక్సిజన్ బ్యాంకులు ఎర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ఆక్సిజన్ సిలిండర్లను తరలిస్తున్న వీడియోను చిరంజీవి ట్విటర్‌లో షేర్ చేశారు. చిరు […]