‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అనేది తెలుగులో సూపర్ హిట్ డైలాగ్! అయితే, బాలీవుడ్ స్టార్ అక్షయ్ విషయంలో అది అక్షరాలా నిజం! గత 30 ఏళ్లుగా ఆయన అద్భుతంగా ఎదుగుతూ వచ్చాడు. యాక్షన్ స్టార్ నుంచీ ఇప్పుడు నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ గా ఎదిగాడు. అయితే, ఈ క్రమంలో ఆయన ఖాతాలో ఎన్నో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్స్ పడ్డాయి. కానీ, అదే సమయంలో మన ఖిలాడీ మిస్సైన సూపర్ మూవీస్ కూడా కొన్ని ఉన్నాయి…
‘బాజీగర్’ సినిమాలో షారుఖ్ పాత్ర మొదట చేయాల్సింది అక్షయ్ కుమారే! కానీ, అందులో నెగటివ్ షేడ్స్ ఉండటంతో అక్కీ వద్దనుకున్నాడట. అలా బాలీవుడ్ బాద్షాకు ఓ భారీ బ్లాక్ బస్టర్ దక్కింది!
షారుఖ్ ఖానే కాదు… మరో ఖాన్ కూడా అక్షయ్ వద్దన్న పాత్ర తీసుకుని ‘రేసు’లో దూసుకుపోయాడు. అతనే సైఫ్ అలీఖాన్. ‘రేస్’ మూవీలో ఆయన చేసిన క్యారెక్టర్ కూడా ఫస్ట్ అక్షయ్ వద్దకే వెళ్లింది. ఆయన రిజెక్ట్ చేశాక రేసులోకి సైఫ్ ఎంట్రీ ఇచ్చాడు!
‘బాజీగర్, రేస్’ లాంటి కమర్షియల్ సినిమాలు మిస్సైనా ఎవ్వరూ పెద్దగా ఫీలవ్వరు. కానీ, అక్షయ్ స్క్రిప్ట్ నచ్చక ‘భాగ్ మిల్కా భాగ్’ తిరస్కరించాడట. ఆ సినిమా ఫర్హాన్ కు వరంగా మారింది. నటుడిగా ఆయన తనని తాను నిరూపించుకున్నాడు అవార్డ్ విన్నింగ్ బయోపిక్ లో. అయితే, అక్షయ్ కి మాత్రం ‘భాగ్ మిల్కా భాగ్’ చేజారటం పెద్ద లోటనే చెప్పాలి!
హాలీవుడ్ ఆఫర్ అంటే ఎగిరి గంతేస్తుంటారు బాలీవుడ్ యాక్టర్స్. అయితే, అక్షయ్ కుమార్ ఓ క్రేజీ ఆఫర్ ని వద్దనేశాడట. పైగా అది ‘ద రాక్’ గా ఫేమస్ అయిన డ్వేన్ జాన్సన్ సినిమాలో. హీరోకి వ్యతిరేకంగా ఉండే నెగటివ్ రోల్ అని సమాచారం. కానీ, క్యారెక్టర్ లో పెద్దగా విషయం లేకపోవటంతో సింపుల్ గా నో చెప్పేశాడట ఖిలాడీ కుమార్!