మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కరోనా బాధితుల కోసం ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలోని చాలా జిల్లాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆయన ఇటీవల తెలిపారు. ఈ మేరకు తొలి విడతగా గుంటూరు, అనంతపురం జిల్లాలకు ఆక్సిజన్ బ్యాంకులు ఎర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ఆక్సిజన్ సిలిండర్లను తరలిస్తున్న వీడియోను చిరంజీవి ట్విటర్‌లో షేర్ చేశారు. చిరు మాట్లాడుతూ.. “అనుకున్న ప్రకారం వారం రోజులలోపే వందలకొద్ది ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు సంపాదించాం. అనంతపురం, గుంటూరు జిల్లాల్లో బుధవారం నుంచి ‘చిరు ఆక్సిజన్ బ్యాంక్’ సేవలు ప్రారంభమవుతున్నాయి. గురువారం నుంచి ఖమ్మం, కరీంనగర్‌లతోపాటు మరో ఐదు జిల్లాల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని చిరు తెలియజేశారు.