‘రామానంద్ సాగర్’… ఈ పేరు చెప్పగానే ఏం గుర్తుకు వచ్చింది? అసలు రామానంద్ సాగర్ ఎవరో, ఎట్లా ఉంటాడో తెలియకున్నా ఆయన రూపొందించిన ‘రామాయణం’ మాత్రం జ్ఞాపకం వచ్చే ఉంటుంది! దూరదర్శన్ లో ఆయన తెరకెక్కించిన రామకథ ప్రసారం అవుతుంటే వీధులన్నీ ఖాళీ అయిపోయేవట! తరువాతి కాలంలో రామానంద్ సాగర్ అంటే రామాయణానికి మారుపేరు అయిపోయాడు! ఇప్పుడాయన గురించి మనం మాట్లాడుకోవటానికి కారణం ఆయన ముని మనవరాలే…
సాక్షి చోప్రా… ఈమెవరు అంటే ఇన్ స్టాగ్రామ్ లోని యాక్టివ్ నెటిజన్స్ కి బాగానే తెలుసు. రామానంద్ సాగర్ గ్రేట్ గ్రాండ్ డాటర్ గా పాప్యులర్! అయితే, తాతగారు రామాయణం తీస్తే… ఈమె మాత్రం సంప్రదాయవాదులు ‘రామ! రామ!’ అనేలా ఫోజులిస్తుంటుంది! సాక్షి చోప్రా కేక పెట్టించే బికినీ పిక్స్ ఎప్పుడూ హాట్ కేక్సే! తాజాగా మరోసారి సాక్షి అగ్ని పర్వతంలా సొగసుల లావాని వెదజల్లింది.
ఎంతటి షార్ట్ అండ్ సెక్సీ దుస్తుల్లోనైనా కాన్ఫిడెంట్ గా ఫోజులిచ్చే సాక్షి మొదట ట్రినిటీ స్కూల్ ఆఫ్ లండన్ లో చదువుకుంది. తరువాత ద లీ స్ట్రాట్స్ బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో ఫిల్మ్ మేకింగ్ లో మెలకువలు అభ్యసించింది.
భవిష్యత్తులో తెర మీద సత్తా చాటుతుందో, లేక తెర వెనుక క్రియేటివిటి ప్రదర్శిస్తుందోగానీ… ఇప్పటికైతే ఈ యంగ్ బ్యూటీ సాక్షి చోప్రా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ఇన్ స్టాగ్రామ్ లో నగ్నంగా కూడా హొయలుపోయి కుర్రాళ్ల మతిపోయేలా చేసింది!