దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ బుధవారం నుంచి తెలంగాణ జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. అత్యవసర సేవలు మినహా మిగతా విధులు బహిష్కరి స్తున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రకటించింది. కాగా, తాజాగా జూనియర్ డాక్టర్ల సమ్మెపై మంత్రి కేటీఆర్ స్పందించారు. జూనియర్ డాక్టర్ల సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని, సమ్మె చేసేందుకు ఇది సమయం కాదన్నారు. సమ్మె విరమించాలని అందరినీ కోరుతున్నా.. లేదంటే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని మంత్రి […]
మనోరమ పేరు వింటే ఈ తరం వారికి ఆమె నటించిన ముసలి వేషాలే ముందుగా గుర్తుకు వస్తాయి. 1958 నుండి 2015 దాకా అంటే 57 సంవత్సరాలు చిత్రసీమలో తనదైన బాణీ పలికిస్తూ, దాదాపు 1500 చిత్రాలలో నటించారు మనోరమ. అన్ని చిత్రాలలో నటించిన నటి మరొకరు మనకు కానరారు. తెలుగు, తమిళ భాషల్లో అత్యధిక చిత్రాలలో తల్లి పాత్రలు పోషించి మెప్పించారు. కొన్ని చిత్రాలలో కథానాయికగానూ నటించారు. హాస్య పాత్రల్లో తనకు తానే సాటి అనిపించారు. […]
‘కాన్ జ్యూరింగ్’ సిరీస్ హారర్ మూవీ లవ్వర్స్ కి బాగా ఇష్టమైన ఫ్రాంఛైజ్. ప్యాట్రిక్ విల్సన్, వెరా ఫార్మిగా ప్రధాన పాత్రలు పోషించారు. అయితే, ‘కాన్ జ్యూరింగ్’, ‘కాన్ జ్యూరింగ్ 2’ సూపర్ సక్సెస్ అవ్వటంతో ఇప్పుడు మూడో చిత్రం కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ‘ద కాన్ జ్యూరింగ్ : ద డెవిల్ మేడ్ మీ డూ ఇట్’ సినిమా 2019, జూన్ 3న ప్రాంభమైంది. అప్పట్నుంచీ కంటిన్యూగా పిక్చరైజేషన్ పూర్తి చేసుకున్న ‘కాన్ జ్యూరింగ్ […]
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు లేఖ రాశారు. కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు రూ.రెండు లక్షల ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని కోరుతూ కేసీఆర్‌కు వి.హనుమంతరావు లేఖ రాశారు. ఎంత ఖర్చుకైనా ప్రభుత్వం వెనుకాడదని ఇంతకు ముందే ముఖ్యమంత్రి హోదాలో ప్రకటించారని వి.హనుమంతరావు గుర్తుచేశారు. కరోనా రోగులకు కిట్స్ పంపిణీ చేయాలని వీహెచ్ కోరారు.
నటుడు సోనూసూద్ కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో తొలి ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో సోనూసూద్ మానవతా హృదయానికి అందరూ ఆయన ఫొటోకు పాలాభిషేకం చేశారు. అది కాస్త వైరల్ గా మరి సోనూసూద్ దాకా చేరింది. ఈ నేపథ్యంలో సోను ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. మీ అభిమానానికి […]
దేశవ్యాప్తంగా కరోనా కేసుల తగ్గుముఖం పడుతున్న వేళ తమిళనాడులో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తమిళనాడులో 34,285 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌కు మరో 468 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో అత్యధిక కేసులు తమిళనాడులోనే నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో కొత్తగా వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ స్ట్రెయిన్ తమిళ ప్రజలకు మరింత గుబులు పుట్టిస్తోంది. ఇక దేశంలో కరోనా కేసుల పాజిటివిటీ రేటు 11.53%కి తగ్గింది. రికవరీ రేటు 88.69%కి పెరిగింది.
కరోనా మహమ్మారిని అంతం చేయడానికి ప్రజలు ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా కర్ణాటక బెల్గాం దక్షిణ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో బీజేపీ ఎమ్మెల్యే అభయ్ పాటిల్ హోమాలు నిర్వహించారు. అగ్ని హోమం పొగతో కరోనా పరార్ అవుతుందంటూ ఎమ్మెల్యే ప్రచారం చేపట్టారు. హోమాల్లో నెయ్యి, కర్పూరం, నిమ్మకాయలు, బియ్యం, లవంగాలను ఉపయోగించారు. దాదాపు 50 చోట్ల హోమాలను జరిపారు. వాతావరణం పరిశుభ్రమౌతుందని పాటిల్ అంటున్నాడు. ఓ బండిలో హోమం కాల్చుతూ ఊరంతా తిప్పారు. […]
దేశంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కరోనాతో పోరాడుతున్నారు. ఇలాంటి ఆపద సమయంలో చాలా మంది తమకు తోచిన సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణకు సాయంగా నిలిచేందుకు కోరమాండల్ ఫర్టిలైజర్స్ సంస్థ ముందుకొచ్చింది. తెలంగాణ సీఎం సహాయనిధికి రూ.1 కోటి విరాళం ప్రకటించింది. కోరమాండల్ ఫర్టిలైజర్స్ ఎండీ సమీర్ గోయల్, వైస్ ప్రెసిడెంట్ కె.సత్యనారాయణ ఇవాళ హైదరాబాద్ ప్రగతి భనవ్ లో సీఎం కేసీఆర్ ను కలిసి విరాళం చెక్ ను అందజేశారు.
సుధ కొంగర దర్శకత్వంలో ఇటీవల ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాతో సూపర్ హిట్ సాధించాడు సూర్య. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇదిలావుంటే, సూర్య కెరీర్ లో వచ్చిన ‘సింగం’ సిరీస్ గూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హరి దర్శకత్వంలో చాలాకాలం క్రితం వచ్చిన ‘సింగం’ భారీ విజయాన్ని సాధించింది. సూర్య కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. కాగా మరోసారి సూర్య, హరి కాంబినేషన్‌లో ఈ సిరీస్‌లో ‘సింగం 4’ తెరకెక్కించడానికి రంగం […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం ‘సలార్’. శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో ప్రభాస్ ను ఢీకొట్టబోయే నటుడు కోసం అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం నటించే అవకాశం కనిపిస్తోంది. చిత్రంలోని ఓ కీలకమైన నెగిటివ్ పాత్ర కోసం ఆయనను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే గనుక […]