పలు దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండగా జపాన్ లో మాత్రం ఫోర్త్ వేవ్ విజృంభణ మొదలైంది. ముఖ్యంగా జపాన్ ప్రధాన నగరం ఒసాకాలో కరోనా తీవ్రత నానాటికీ పెరుగుతోంది. కేవలం 90 లక్షల జనాభా ఉన్న జపాన్‌లో ఈ ఒక్క వారంలో 3849 పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జపాన్‌లో సంభవిస్తోన్న కొవిడ్ మరణాలు కూడా ఒసాకా నగర ప్రజలను కలవరపెడుతున్నాయి. దేశంలో నమోదవుతున్న మొత్తం మరణాల్లో దాదాపు 25 శాతం ఆ […]
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కరోనా కేసులు తగ్గడంతో రెగ్యులర్ సేవలు ప్రారంభిస్తున్నాయి. కరోనా నెగిటివ్ వచ్చిన వారంతా త్వరగా కోలుకుంటుండటం, అత్యధికులకు ఐసీయూ బెడ్స్ అవసరం రాకపోవడంతో కరోనా అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇక కోవిడ్-19 ఆసుపత్రుల్లో చాలా పడకలు ఖాళీగానే ఉన్నాయి, ఆసుపత్రుల్లో రద్దీ కూడా ఎక్కువగా కనిపించడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్న […]
సీనియర్ హాలీవుడ్ నటుడు, గాయకుడు శామ్యూల్ ఎడ్వర్డ్ రైట్ మే 24వ తేదీన మరణించాడు. న్యూయార్క్ లోని వాల్డన్ లో ఉన్న ఆయన స్వంత ఇంట్లో శామ్యూల్ తుది శ్వాస విడిచాడు. ఆయన మరణానికి కారణం ప్రొస్ట్రేట్ క్యాన్సర్ అని అతడి కూతురు ప్రకటించింది. అయితే, 1989లో విడుదలైన ‘ద లిటిల్ మెర్మెయిడ్’ సినిమాలో ‘సెబాస్టియన్ ద క్రాబ్’ పాత్రకిగానూ శామ్యూల్ ఫేమస్. డిస్నీ వారి ఆ యానిమేషన్ మూవీకి ఆయన వాయిస్ అందించాడు. ఇక ‘ద […]
అద్భుతమైన నటనతోనో, జాతీయ అవార్డులతోనో లేదంటే కాంట్రవర్సీలతోనో వార్తల్లో ఉంటుంది కంగనా రనౌత్. అయితే, ఈ సారి కాస్త భిన్నంగా పచ్చనైన సందేశంతో నెటిజన్స్ ముందుకొచ్చింది. కంగనా 20 చెట్లు నాటింది. ఆ సమయంలో తీసిన ఫోటోల్ని సొషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, చిన్నపాటి సందేశాన్ని కూడా తన ఫాలోయర్స్ కి ఇచ్చింది ‘క్వీన్’ ఆఫ్ బాలీవుడ్…ఈ మధ్య వచ్చిన తౌక్టే తుఫాను మహారాష్ట్ర, గుజరాత్ లో కల్లోలం సృష్టించింది. ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు, […]
బీటీఎస్ మ్యూజిక్ బ్యాండ్ విడుదల చేసిన ‘బట్టర్’ సాంగ్ యూట్యూబ్ లో తుఫానులా కొనసాగుతోంది. అలాగే, ఆడియో షేరింగ్ వెబ్ సైట్ స్పొటిఫైలోనూ ‘బట్టర్’దే హంగామా! ఇవన్నీ పక్కన పెడితే కొరియన్ బాయ్స్ తమ ‘బట్టర్’ సాంగ్ తో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ని కూడా షేక్ చేస్తున్నారు!పోయిన సంవత్సరం బీటీఎస్ విడుదల చేసిన ‘డైనమైట్’ సాంగ్ ఇంకా అవార్డులు సాధించి పెడుతోంది ఏడుగురు సింగర్స్ కి. అయితే, ఈసారి ‘బట్టర్’ మ్యూజికల్ అండ్ […]
తెలంగాణలో మే 12 నుంచి లాక్‌డౌన్ కొనసాగుతోంది. మే 30 వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని వ్యాపారాలు, కార్యకలాపాలకు అనుమతి ఇస్తున్నారు. ఆ తర్వాత అత్యవసర సేవలు మినహా ఎలాంటి వాటికి అనుమతి లేదు. కాగా, మరో నాలుగు రోజుల్లో లాక్‌డౌన్ ముగియనుంది. దీంతో లాక్‌డౌన్ కంటిన్యూ చేస్తారా లేదా అన్నది హాట్‌టాపిక్‌గా మారింది. ఇలాంటి సమయంలో లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునేందుకు కేబినెట్ భేటీకి తేదీ […]
కరోనా కష్టకాలంలో తన వంతుగా కోవిడ్ బాధితులకు సాయం చేసేందుకు సినిమా సెలెబ్రిటీలు ముందుకొస్తున్నారు. తాజాగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ‘డిస్ట్రిబ్యూట్ లవ్’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. కోవిడ్ సంబంధిత అన్ని సహాయాలను అందించేలా ఈ సంస్థ నడుస్తుందని, సాయం అవసరమున్న ప్రతి ఒక్కరు ఈ వెబ్ సైట్ కు రిక్వెస్ట్ లు పెట్టొచ్చని ఆమె పేర్కొంది. అలా వచ్చిన అభ్యర్థనలు పరిశీలించి సాయం చేసేందుకు ఓ టీమ్ పని […]
మామూలుగా సినిమాలకి ఉన్నంత క్రేజ్ సీరియల్స్ కి ఉండదు. కానీ, ఇది పాత మాట. ఇప్పుడు టీవీ సీరియల్స్ కూడా ఫుల్ డిమాండ్ లో ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా, కొన్ని అరుదైన కామెడీ సీరియల్స్ మళ్లీ మళ్లీ కావాలని జనం కోరుకుంటూ ఉంటారు. అటువంటిదే హిందీలో వచ్చిన ‘కిచిడి’. ఓ గుజరాతీ కుటుంబంలో జరిగే కామెడీ సీన్సే ఈ సీరియల్ లో కథ! పెద్దగా స్టోరీ ఏం లేకున్నా నటీనటుల డైలాగ్స్, యాస, హావభావాలు ప్రేక్షకులకి భలేగా […]
ఆనందయ్య మందుపై పరిశోధనలు జరుగుతూనే వున్నాయి. అటు జంతువులపైనా ప్రయోగాలు చేస్తున్నారు. మంగాపురంలోని యానిమల్ ల్యాబ్ లో ఈ పరిశోధనలు చేస్తున్నారు. నాలుగు దశల్లో ట్రయల్స్ నిర్వహించి, ప్రభుత్వ నివేదిక ఆధారంగా మందును సరఫరా చేస్తామని ఎమ్మెల్యే చెవిరెడ్డి అన్నారు. మందు పంపిణీకి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కాగా కొవిడ్ అధికంగా ఉన్న జంతువుపై కంటి మందు ప్రయోగం చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రయోగాలకు కనీసం నెల రోజులు పట్టే […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి, సాహో సినిమాలతో పాన్ ఇండియా సినిమా స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నాడు. కాగా సోషల్ మీడియాలో ప్రభాస్ ఏకంగా హాలీవుడ్ సినిమా చేస్తున్నాడని ప్రచారం జరిగింది. యాక్షన్ హాలీవుడ్ చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ ప్రభాస్ నటించనున్నట్లుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా ఈ సినిమా దర్శకుడు క్రిస్టోఫర్ మెక్‌క్వారీ ప్రభాస్ పై వస్తున్న వార్తలు అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ […]