Saving Account: మీ బ్యాంక్ ఖాతాల్లో నిరంతరం డబ్బులు వేస్తున్నారా..? ఐటీ నోటీసులొస్తాయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాంకులో ఎంత డబ్బు దాచుకుంటే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు రావు? మన సంపాదనలో కొంత భాగాన్ని భవిష్యత్తు అవసరాల కోసం బ్యాంకులో జమ చేయడం సహజం. అయితే, ఎంత మొత్తానికి మించి జమ చేస్తే ట్యాక్స్ కట్టాలి లేదా ప్రభుత్వానికి లెక్క చెప్పాలనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
పొదుపు ఖాతా, కరెంట్ ఖాతా..
సాధారణంగా ఒక ఆర్థిక సంవత్సరంలో మీ సేవింగ్స్ అకౌంట్‌లో రూ.10 లక్షల వరకు నగదు జమ చేసుకోవచ్చు. అంతకు మించి జమ చేస్తే.. బ్యాంకులు ఆ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖకు నివేదిస్తాయి. అదే మీరు వ్యాపారాల కోసం వాడే కరెంట్ అకౌంట్ అయితే.. ఈ పరిమితి రూ.50 లక్షల వరకు ఉంటుంది.
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
మీరు జమ చేసే డబ్బు రూ.10 లక్షల లోపే ఉన్నా, అది పన్ను పరిధిలోకి రాదని గ్యారెంటీ లేదు. ఒకవేళ మీ వార్షిక ఆదాయం తక్కువ ఉండి, అకౌంట్లో ఎక్కువ డబ్బు జమ అయితే అధికారులు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగే అవకాశం ఉంటుంది. మీ దగ్గర సరైన ఆధారాలు ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
పాన్ కార్డు (PAN Card): ఒకే రోజులో రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ నగదు జమ చేయాలంటే ఖచ్చితంగా పాన్ కార్డు వివరాలు ఇవ్వాలి. ఇది పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది.
వడ్డీపై పన్ను: మీ సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డబ్బుపై వచ్చే వడ్డీ రూ.10,000 లోపు ఉంటే పన్ను మినహాయింపు ఉంటుంది. అంతకు మించి వచ్చే వడ్డీని మీ మొత్తం ఆదాయానికి కలిపి, మీ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు.
క్రెడిట్ కార్డ్ బిల్లులు: క్రెడిట్ కార్డ్ బిల్లును నగదు రూపంలో రూ.1 లక్ష కంటే ఎక్కువ చెల్లించినా అది ఆదాయపు పన్ను శాఖ దృష్టికి వెళ్తుంది.
Also Read:RCB Vs LSG: నిప్పులు చెరిగిన ఆర్సీబీ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన LSG..
పెద్ద మొత్తంలో నగదును బ్యాంకులో జమ చేయడం నేరం కాదు, కానీ ఆ డబ్బుకు సరైన లెక్క ఉండాలి. ఒకవేళ ఆ డబ్బు ఎలా వచ్చిందో మీరు నిరూపించలేకపోతే, దానిని ‘లెక్క చూపని ఆదాయం’గా పరిగణించి భారీగా జరిమానాలు వేసే అవకాశం ఉంది. కాబట్టి, సాధ్యమైనంత వరకు నగదు లావాదేవీల కంటే ఆన్‌లైన్ బదిలీలు (UPI, NEFT) లేదా చెక్కుల ద్వారా లావాదేవీలు చేయడం సురక్షితం. దీనివల్ల పారదర్శకత ఉంటుంది.. అనవసరమైన విచారణల నుంచి తప్పించుకోవచ్చు. మీరు పెద్ద మొత్తంలో నగదు జమ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన రశీదులు లేదా ఆధారాలను భద్రపరుచుకోవడం మంచిది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!