RCB Vs LSG: విరాట్ వీరవిహారం.. బెంగళూరు ఘన విజయం.. ఆర్సీబీకి మరో ప్లస్ కూడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. బుధవారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘనవిజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్.. ఇలా రెండు విభాగాల్లోనూ సమిష్టిగా రాణించి లక్నోను చిత్తు చేసింది.
మ్యాచ్ హైలైట్స్..
టాస్ గెలిచిన బెంగళూరు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ యువ బౌలర్ రసీఖ్ దార్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో లక్నో బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. కేవలం 24 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి లక్నో పతనాన్ని శాసించాడు. లక్నో జట్టులో మిచెల్ మార్ష్ (40), ముకుల్ చౌదరి (39) కాసేపు పోరాడినప్పటికీ, మిగిలిన ఆటగాళ్లు విఫలమవడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
Also Read:Saving Account: మీ బ్యాంక్ ఖాతాల్లో నిరంతరం డబ్బులు వేస్తున్నారా..? ఐటీ నోటీసులొస్తాయ్..
కోహ్లీ మెరుపులు..
147 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి విరాట్ కోహ్లీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. స్టేడియం నలుమూలలా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడిన కోహ్లీ 49 పరుగులు చేసి తృటిలో అర్ధసెంచరీ చేజార్చుకున్నాడు. అయినప్పటికీ జట్టును విజయానికి చేరువ చేశాడు. రజత్ పాటిదార్ (27) కూడా విలువైన పరుగులు జోడించడంతో ఆర్సీబీ కేవలం 15.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ భారీ విజయం తర్వాత ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. కేవలం 15.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించడం వల్ల ఆర్సీబీ నెట్ రన్ రేట్ కూడా గణనీయంగా పెరిగి +1.503 వద్ద కొనసాగుతోంది. చిన్నస్వామి స్టేడియంలో సొంత అభిమానుల మధ్య కోహ్లీ సేన జైత్రయాత్ర కొనసాగించడం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ముఖ్యంగా రసీఖ్ దార్ బౌలింగ్ ప్రదర్శనపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
తాజావార్తలు
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్‌ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!