వరుస పరాజయాలతో ఎంతో కాలంగా ప్రయాణం చేస్తున్న ‘అల్లరి’ నరేశ్ కు చెప్పుకోదగ్గ విజయాన్ని అందించింది ‘నాంది’ చిత్రం. ఈ కోర్ట్ డ్రామా విమర్శకుల ప్రశంసలు పొందడమే కాదు… సాధారణ ప్రేక్షకుడిలోనూ ఓ ఉత్సుకతను కలిగించింది. నటుడిగా నరేశ్ ను మరో మెట్టు పైన నిలిపింది. థియేటర్లలోనే కాకుండా ఆ తర్వాత ఆహా లో స్ట్రీమింగ్ అయినప్పుడు కూడా అదే ఆదరణ ఈ చిత్రానికి లభించింది. ఇక ఇప్పుడు ఈ నెల 30న ఈ సినిమాను జెమినీ టీవీలో ప్రసారం చేయబోతున్నారు. సతీశ్ వేగేశ్న నిర్మించిన ఈ సినిమాతో విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం అయ్యాడు. శ్రీచరణ్ పాకాల సంగీతం తో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్ పోషించిన లాయర్ పాత్ర సైతం సినిమా విజయానికి దోహదపడింది.