తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఎమ్మెల్యే పదవికి సైతం ఈటల రాజేందర్ రాజీనామా చేయనున్నారు. దీనిలో భాగంగా ఈ రోజు రాజేందర్ స్పీకర్‌కు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా లేఖను పంపనున్నారు. టీఆర్ఎస్ పార్టీతో తనకున్న 19 ఏళ్ల అనుబంధాన్ని వదులుకుంటున్నట్లు రాజేందర్ ప్రకటించారు. ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ వదులుకోబోనని… బానిసగా బతకలేనని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ధర్మాన్ని నమ్ముకున్న కేసీఆర్…. ఇప్పుడు […]
అసోం రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడి కోసం జూన్ 16వ తేదీ వరకు లాక్ డౌన్ ఆంక్షలను పొడిగించింది. మొదట జూన్ 5వ తేదీ వరకు లాక్ డౌన్ విధించిన సర్కారు దీన్ని మరో 10 రోజులకు పొడిగించింది. కర్ఫ్యూ సమయాన్ని ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు తగ్గించినట్లు అసోం సీఎం హిమంత బిశ్వా శర్మ చెప్పారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ప్రజల రాకపోకలపై […]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న10వ సినిమా ‘గని’. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ కథతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయిక నటిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పణలో, రినైస్సాన్స్ – బ్లూ వాటర్ క్రియేటివ్ బ్యానర్‌లో అల్లు బాబీ, సిద్ధు నిర్మిస్తున్నారు. ఉపేంద్ర, సునీల్ శెట్టి కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ జులై నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాక్సింగ్ […]
తెలంగాణ రాష్ట్రంలో కరోనా విపత్తు ప్యాకేజీ కింద నేటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఇచ్చే ఉచిత బియ్యంతో పాటు తెలంగాణ కోటా కింద కూడా ఉచిత బియ్యం పంపిణీ చేయనుంది. తెలుపు రేషన్ కార్డు ఉన్న ఒక్కో వినియోగదారునికి 15 కిలోల చొప్పున పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎలాంటి పరిమితులు లేకుండా కార్డుపై ఎందరుంటే అందరికి 15 […]
నేడు గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి కావడంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నివాళులు అర్పించింది. చాలా మంది ప్రముఖులు ఆయన్ను స్మరించుకున్నారు. ఇటు సోషల్ మీడియాలోనూ బాలు లేని లోటు పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బాలుతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగాలకు లోనయ్యారు. ‘మిస్ యూ మామా’ అంటూ చిన్ననాటి ఫోటో షేర్ చేశారు. 1996 దక్షిణ కొరియాలోని సియోల్ ఎయిర్ పోర్టులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో తమన్ […]
మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్మించిన 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కు అరుదైన ఘనత దక్కింది. జాతీయ స్థాయిలో జైపూర్ ఎస్టీపీపీ ‘బెస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ పెర్ఫార్మర్’ అవార్డు దక్కించుకుంది. జాతీయ స్థాయిలో విద్యుత్ వినియోగం, విద్యుత్ పరిశ్రమల్లో ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం, మొదలైన విషయాలపై మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ అనే ముంబైకి చెందిన సంస్థ శుక్రవారం నిర్వహించిన వీడియో సెమినారులో ఈ అవార్డు ప్రకటించారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ […]
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య, లోకనాయకుడు కమల్ హాసన్ తో భారతీయుడు 2, అక్కినేని నాగార్జున-ప్రవీణ్ సత్తారు చిత్రంలోనూ కాజల్ కథానాయికగా నటిస్తోంది. అటు వెబ్ సిరీస్ లోను కాజల్ ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తూ పోతుంది. తాజాగా కాజల్ ‘ఉమ’ టైటిల్‌తో తెరకెక్కబోయే బాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రం చేస్తున్నందుకు చాలా […]
మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులను పొరుగింటివారి పెంపుడు కుక్క కరిచిందని తెలిసి.. దాన్ని తుపాకీతో కాల్చి చంపేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన పొరిగింటివారు పోలీస్ కేసు పెట్టారు. అనంతరం ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సెక్షన్ 429 జంతువుల పట్ల క్రూరత్వం కింద అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే ఆ కుక్కను కాల్చిన నిందితుడు.. తన భార్యకు, విధుల్లోకి వారందరికీ చేసిన […]
డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సన్నాఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రం దాదాపు చిత్రీకరణ కంప్లీట్ చేసుకుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ తమిళ స్టార్ హీరో సూర్య చేతుల మీదుగా విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ ప్రారంభమవుతోంది. ‘తాను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో, ఎప్పుడు […]
ప్రముఖ దర్శకుడు, స్వర్గీయ శోభన్ కుమారుడు సంతోష్ శోభన్. పెదనాన్న లక్ష్మీపతి నుండి నటనను వారసత్వంగా అందిపుచ్చుకున్న సంతోష్ పేపర్ బోయ్ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. తాజాగా యూవీ కనెక్ట్స్ సంస్థ సంతోష్ శోభన్ హీరోగా నిర్మించిన ఏక్ మినీ కథ మూవీ ఇటీవలే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ అందుకోకపోయినా… నటుడిగా శోభన్ కు మంచి గుర్తింపే తెచ్చిపెట్టింది. విశేషం ఏమంటే… ప్రస్తుతం […]