డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సన్నాఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రం దాదాపు చిత్రీకరణ కంప్లీట్ చేసుకుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ తమిళ స్టార్ హీరో సూర్య చేతుల మీదుగా విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ ప్రారంభమవుతోంది. ‘తాను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో, ఎప్పుడు ఏ వేషంలో ఉంటాడో ఆ దేవుడికే ఎరుక’ అంటూ చిరంజీవి ఇచ్చిన వాయిర్ ఓవర్ ఆకట్టుకుంది. ఇక మోహన్ బాబు అనేక రకాల లుక్‌లలో కనపడుతున్నారు. ‘నేను కసక్ అంటే మీరందరూ ఫసక్’ అవుతారంటూ ఆయన చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. మరి ఆ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.