సమాజ హితం కోసమంటూ ప్రముఖ బాలీవుడ్ నటి జుహీ చావ్లా చేసిన ఓ న్యాయ పోరాటం ఆమెను ఊహించని విధంగా చిక్కుల్లో పడేసింది. 5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా జుహీచావ్లా కొంతమందితో కలిసి ఢిల్లీ హైకోర్టులో ఆ మధ్య పిటీషన్ వేసింది. 5 జీ టెక్నాలజీ వల్ల తీవ్రమైన ప్రమాదం ఉందని, పౌరులకు ఎలాంటి హానీ జరగదని ప్రభుత్వం ధృవీకరించే వరకూ ఆ టెక్నాలజీని ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని ఆ పిటీషన్ లో ఆమె కోరింది. అయితే ఇదంతా […]
సమంత నటించిన తొలి వెబ్ సీరిస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2. విశేషం ఏమంటే… ఆ సీరిస్ కు సమంతే హైలైట్. ఆమె పోషించిన రాజి పాత్రకు వస్తున్న అప్లాజ్ ఇంతా అంతా కాదు. ఇదే విషయాన్ని సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొంది. తమిళ ఈలం కు చెందిన ఉద్యమకారిణి పాత్ర తాను చేయడానికి గల కారణాలనూ సమంత వివరించింది. రాజ్ అండ్ డీకే ఈ పాత్ర ను గురించి తనకు చెప్పిన […]
బాలీవుడ్ లో బయోపిక్స్ జాతర ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు. ఎప్పటికప్పుడూ కొత్త బయోపిక్ ప్రాజెక్ట్స్ ప్రకటిస్తోన్న బీ-టౌన్ ఫిల్మ్ మేకర్స్, తాజాగా, సహారా సంస్థ చైర్మన్ సుబ్రతా రాయ్ జీవితంపై దృష్టి పెట్టారు. జూన్ 10న ఆయన 73వ జన్మదినం సందర్భంగా మూవీ అనౌన్స్ చేయనున్నారట. అయితే, బాలీవుడ్ లో ఈ టాక్ వినిపిస్తున్నప్పటికీ… దర్శకనిర్మాతలు ఎవరు? నటీనటుల వివరాలేంటి? మొదలైన అంశాలేవీ ఇంకా బయటకు రావటం లేదు. జూన్ 10వ తేదీనే సమాచారం మొత్తం వెలువడే […]
కరోనా వచ్చింది. కొంచెం వెనక్కి తగ్గింది. జనం కాస్త రిలాక్స్ అయ్యారు. అందుకే, సెకండ్ వేవ్ తో కల్లోలం సృష్టించింది. ఇక ఇప్పుడు ఎలాగో నానా తంటాలు పడి రెండో కరోనా తుఫానుని కూడా తగ్గించగలిగాం. కానీ, స్టోరీ ఇంతటితో ముగిసిపోలేదు. ‘హర్ ఘర్ నే థానా హై, కరోనా కో హరానా హై’ అంటున్నారు మన చిరంజీవి, బాలీవుడ్ స్టార్ అక్షయ్, తమిళ స్టార్ ఆర్య, కన్నడ పవర్ స్టార్ పూనీత్ రాజ్ కుమార్!‘ద ఫెడరేషన్ […]
శేఖర్ కమ్ముల లీడర్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఎన్.ఆర్.ఐ.భామ రిచా గంగోపాధ్యాయ. ఆ తర్వాత మిరపకాయ్, మిర్చి, నాగవల్లి వంటి తెలుగు సినిమాలతో పాటు కోలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో నటించి కథానాయికగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. నాగార్జున భాయ్ చిత్రంలో చివరగా నటించిన రిచా ఆ తర్వాత అమెరికా తిరిగి వెళ్ళిపోయి, బిజినెస్ మేనేజ్ మెంట్ ప్రోగ్రామ్ చేసింది. ఇక 2019లో తన స్నేహితుడు జోయ్ లంగెల్లాను రిచా వివాహం చేసుకుంది. అయితే […]
నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందేశాన్ని ఇచ్చారు. “పర్యావరణానికి అనుకూలమైన అలవాట్లను అలవర్చుకోవాలని పిలుపునిచ్చాడు. ప్రకృతితో కలిసిపోతూ, అది ఏం చేసిన అభినందించాలని కోరాడు. ముందటి తరాల కోసం.. ఈ భూగ్రహాన్ని మరింత పచ్చగా మారుద్దమన్నారు. గ్రీనరీ కోసం ప్రతి ఒక్కరు చొరవ తీసుకుని మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశాడు. ఈమేరకు మొక్కలు నాటిన బన్నీ, అభిమానులు నాటిన మొక్కలు కూడా తనతో పంచుకోవాలని కోరాడు. […]
గత కొంతకాలంగా కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఈ మహమ్మారి వల్ల తీవ్రంగా దెబ్బతిన్న మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, బిహార్ తదితర రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గడం కొంత ఊరటనిస్తోంది. రికవరీ రేటు కూడా పెరగడంతో కరోనా సెకండ్ వేవ్ ముగింపు దశకు వచ్చినట్లుగా అంతా భావిస్తున్నారు. అయితే కరోనా మరణాల విషయంలో చాలా రాష్ట్రాలు నిజాలు దాస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కరోనా టెస్టులు కూడా తక్కువగా చేయడం […]
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిన్న టిఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. ఉద్యమ నేత నుంచి టీఆర్ఎస్‌లో కీలకనేత స్థాయికి ఎదిగిన ఈటల రాజేందర్ ఎట్టకేలకు 19 ఏళ్ల అనుబంధం తరువాత టీఆర్ఎస్‌తో బంధానికి స్వస్తి పలికారు. కాగా నేడు ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను స్పీకర్ కు సమర్పించే అవకాశం ఉండగా.. ఆ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. మంచి రోజు కోసం చూస్తున్న ఈటలకు […]
ప్రియుడి బలవన్మరణాన్ని తట్టుకోలేక.. ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన తమిళనాడులోని కరూర్ జిల్లాలో జరిగింది. కామరాజ నగర్లోని ఆశిక్ (19) తన ఊరిలోనే ఓ అమ్మాయిని (17) ప్రేమించాడు. ఈ క్రమంలో ఇద్దరు ప్రేమికుల మధ్య చిన్నపాటి మనస్పర్థలు వచ్చాయి. దీంతో యువతి ఆశిక్తో మాట్లాడటానికి నిరాకరించింది. మనోవేదనకు గురైన ఆశిక్.. ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడి మరణంతో మానసికంగా కుంగిపోయిన ఆ యువతి సైతం బలవన్మరణానికి పాల్పడింది.
ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ కారణంగా పరభాషా చిత్రాలను మాతృభాషలో చూడగలిగే అదృష్టం తెలుగు సినిమా ప్రేమికులకు లభిస్తోందంటే అతిశయోక్తి కాదు. నిజానికి కొన్ని చిత్రాలను కమర్షియల్ యాస్పెక్ట్ లో నిర్మాతలు డబ్ చేయడానికి తటపటాయించే సమయంలో ఆహాలో వాటిని చూడగలగడం అదృష్టం అనే చెప్పాలి. తాజాగా ఆహా ఓటీటీలో టొవినో థామస్ కాలా చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. దాని గురించి తెలుసుకుందాం. ప్రతి మనిషిలో మంచి, చెడు గుణాలు కలబోసి ఉంటాయి. ఒక్కో సమయంలో ఒక్కో […]