దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుతుండటంతో వివిధ రాష్ట్రాలు లాక్‌డౌన్ నిబంధనలకు సడలింపులు ఇస్తున్నాయి. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం పాజిటివిటీ రేటు ఐదు శాతం కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసింది. ఇక థియేటర్లలో సినిమా ప్రదర్శనలకు కరోనా నిబంధనలతో అనుమతులు ఇచ్చింది మహారాష్ట్ర సర్కార్. దీంతో ఈ నెల 7 నుంచే బాలీవుడ్ వర్గాలు చిత్రీకరణలకు సిద్ధం అవుతున్నాయి. అయితే టాలీవుడ్ లో థియేటర్ల ఓపెనింగ్ కు మాత్రం మరికొద్ది రోజుల వరకు పర్మిషన్ […]
టీఆర్ఎస్ తో తెగదెంపులు చేసుకున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ భవిష్యత్ కార్యాచరణపై దృష్టిపెట్టారు. ఇక స్పీకర్ కు రాజీనామా లేఖ ఇచ్చేందుకు మంచిరోజు కోసం చూస్తున్నట్టు సమాచారం. అన్ని కుదిరితే సోమవారం ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా లేఖ ఇస్తారని తెలుస్తోంది. స్పీకర్ ను కలిసి ఇవ్వడమా? లేక ఫ్యాక్స్ లో పంపడమా? అనే అంశంపై ఈటల తన అనుచరులతో చర్చిస్తున్నారని తెలుస్తోంది. రాజీనామా లేఖ ఆమోదం తర్వాత ఈటల బీజేపీలో చేరనున్నారు. చేరిన తరువాత […]
కర్నూలు జిల్లాలో కరోనాతో చనిపోయిన వారిలో పురుషులే అత్యధికంగా ఉన్నారు. తాజా గణాంకాలను పరిశీలిస్తే ఇదే వాస్తవమని తెలిసింది. ఇప్పటివరకు జిల్లాలో 1,12,956 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 1,12,575 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. వైరస్ సోకినవారిలో 751 మంది చనిపోయారు. ప్రస్తుతం జిల్లాలో యాక్టివ్ కేసులు 3,630 వున్నాయి. అయితే కరోనా బారిన పడినవారిలో పురుషులే ఎక్కువగా ఉన్నారు. ఈ నెల 2వ తేదీ వరకు ఉన్న గణాంకాలను పరిశీలిస్తే.. మొత్తం మృతులు […]
కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం క్షీణిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతినిచ్చింది. ఈమేరకు శనివారం ఓ ప్రకటన జారీ చేసింది. దీంతో సోమవారం నుంచి అక్కడ 50శాతం సామర్థ్యంతో సినిమా హాళ్లు తెరుచుకోనున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లకు అనుమతిచ్చిన ప్రభుత్వం.. ప్రేక్షకుల సీట్ల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. థియేటర్, మల్టీప్లెక్స్ ఆవరణలో సోషల్ డిస్టెన్స్ కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ప్రేక్షకులు థియేటర్లలోకి ప్రవేశించగానే ముందుగా థర్మల్ స్క్రీన్ […]
నవీన్ పోలిశెట్టి ‘జాతిరత్నాలు’ సినిమా విజయం తర్వాత ఆయనకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే నవీన్, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి సరసన నటించే అవకాశాన్ని ఆయన సొంతం చేసుకున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి ‘రారా కృష్ణయ్య’ ఫేమ్ మహేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి ‘మిస్ శెట్టి ..మిస్టర్ పోలిశెట్టి’ అనే వెరైటీ టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వయసులో దాదాపు 20 సంవత్సరాలు వ్యత్యాసమున్న […]
మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడటంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. త్వరలోనే ఆయన బీజేపీలో చేరుతుండటంతో బీజేపీ-టీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లడం సీఎం కేసీఆర్ కు నష్టమేనని అన్నారు. తెలంగాణ మరో బెంగాల్ లా మారకుండా జాగ్రత్తపడాలని నారాయణ సూచించారు. అలాగే ఏపీ సీఎం జగన్ బెయిల్ గురించి కూడా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ కి ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘బద్రి’ సినిమాకి.. ఇప్పటికీ యూత్ లో మంచి క్రేజ్ వుంది. ఆ తర్వాత కూడా ఇద్దరూ కలిసి ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా చేశారు. ఇదిలావుంటే, వీరి నుంచి హ్యాట్రిక్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో చూస్తున్నారు. ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో […]
పోస్ట్ కరోనా టైమ్స్ లో భారతదేశంలోనే కాదు… ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం మంది చైనాను ద్వేషించడం మొదలు పెట్టారు. కొవిడ్ 19 వైరస్ చైనాలోని ఊహాన్ ల్యాబ్స్ లోనే పుట్టిందని విశ్వసిస్తున్నారు. చైనాకు వ్యతిరేకంగా గళం విప్పటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరిస్ రూపకర్తలు పర్ ఫెక్ట్ ప్లానింగ్ తోనే మూడో సీజన్ కు శ్రీకారం చుట్టబోతున్నారని తెలుస్తోంది. తొలి సీజన్ లో పాకిస్తాన్ ను, రెండో సీజన్ లో […]
ఆమెకు 37… అతనికి 33… అయితేనేం, ఆ జూనయర్ అందగాడు సీనియర్ సుందరిని పడేశాడు. ఇద్దరూ కలసి రొమాంటిక్ డేట్స్ కానిచ్చేస్తున్నారు. అయితే, ఇక ఇప్పుడు ఆ హీరో, హీరోయిన్ మనకు అసలు విషయం చెప్పేద్దామనుకుంటున్నారట! అఫ్ కోర్స్, ఇంత చెప్పాక ఆ ఇద్దరు లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్ అండ్ కత్రీనా అని అర్థం కాకుండా ఉంటుందా చెప్పండి? ప్రస్తుతం బీ-టౌన్ లో కాక రేపుతోన్న స్టార్ కపుల్ వీరిద్దరే!విక్కీతో క్యాట్ నడుపుతోన్న లవ్ స్టోరీ […]