కన్నడ సీనియర్ స్టార్ హీరో ఉపేంద్ర టాలీవుడ్ సినిమాలో విలన్ పాత్రలోనూ రాణిస్తున్న విషయం తెలిసిందే. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో దేవరాజ్ పాత్రలో మెప్పించిన ఉపేంద్ర, ప్రస్తుతం ‘గని’ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. అయితే తాజాగా ఆయన అక్కినేని అఖిల్ కొత్త సినిమాలో నటించనున్నట్లు సమాచారం. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ‘ఏజెంట్’ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కోసం ఉపేంద్రను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అఖిల్ డిఫరెంట్ లుక్ కనిపించనున్నాడు. కరోనా […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో మరో సరికొత్త రికార్డ్ ను నమోదు చేసుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ పుష్పలో నటిస్తున్నాడు. రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో హీరో పుష్పరాజ్ కు సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియోను ఏప్రిల్ 7న విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్ లో 70 మిలియన్ వ్యూస్ […]
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్ మాతృమూర్తి సుబ్బలక్ష్మి (75) చెన్నయ్ లో కన్నుమూశారు. ప్రముఖ మేకప్ మేన్ మాధవరావు సతీమణి ఆమె. తెలుగు చిత్రసీమలో సీనియర్ మేకప్ మేన్ గా మాధవరావు పేరు తెచ్చుకున్నారు. అంతే కాకుండా దశాబ్దాల పాటు నటుడు కృష్ణకు పర్సనల్ మేకప్ మేన్ గా వ్యవహరించారు. మాధవరావు, సుబ్బలక్ష్మి తనయుడు రాంప్రసాద్ సైతం యాబైకు పైగా తెలుగు సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వ్యహరించారు. సుబ్బలక్ష్మి చెన్నయ్ లోని స్వగృహంలో కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. […]
బాలీవుడ్ లో ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు బోనీ కపూర్ తనయుడు అర్జున్ కపూర్. గత తొమ్మిదేళ్ళలో చేసినవి కొన్ని చిత్రాలే అయినా అతని కంటూ ఓ గుర్తింపు ఉంది. అయితే కొంతకాలంగా అర్జున్ కపూర్ వ్యక్తిగత జీవితం… అతని ప్రొఫెషన్ కంటే కూడా ఎక్కువగా వార్తలలో నానుతోంది. దానికి తోడు ఈ పేండమిక్ సిట్యుయేషన్ లో అర్జున్ నటించిన రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఓటీటీలో విడుదలయ్యాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోది సైతం ఓటీటీకే […]
కరోనా సమయంలో వైద్యులు ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఈ ప్రయత్నంలోనే ఆయా వైద్యులు, సిబ్బంది మహమ్మారి బారిన పడుతున్నారు. కొంతమంది ఆసుపత్రుల్లో ప్రాణాలు వదిలేస్తున్నారు. మరికొంత మంది పూర్తిగా కరోనా నుంచి కోలుకున్న తర్వాత దైర్యంగా తిరిగి విధులకు హాజరవుతున్నారు. అయితే వారి త్యాగాన్ని అందరికి తెలియజేయాలని భావించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన వైద్యులపై ఓ షార్ట్ ఫిల్మ్ చేయాలని భావించిందట. ఇందులో భర్త రామ్‌చరణ్‌ని హీరోగా […]
మనోజ్ బాజ్ పాయ్, సమంత, ప్రియమణి కీలకపాత్రలు పోషించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 అనుకున్న సమయానికంటే ముందే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ రెండో సీజన్ ట్రైలర్ విడుదల కాగానే ఇందులోని కథాంశం విషయంలో జరిగిన చర్చ, ఫలితంగా రాజుకున్న వివాదం కారణంగా అసలు ఇది స్ట్రీమింగ్ అవుతుందా లేదా అనే సందేహాన్ని చాలామంది వ్యక్తం చేశారు. వాటిని పటాపంచలు చేస్తూ అమెజాన్ ప్రైమ్ శుక్రవారం అర్థరాత్రికి కాస్తంత ముందుగానే దీనిని […]
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాల తరువాత మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ కుదిరింది. ముచ్చటగా మూడో చిత్రం రూపొందుతోంది. కోవిడ్ పరిస్థితులు చక్కబడిన తర్వాత ఈ చిత్ర షూటింగ్ మొదలుకానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇదిలావుంటే, ఈ సినిమాలో మహేష్ ‘రా’ ఏజెంట్‌గా కనిపించనున్నట్లు నిన్నమొన్నటి వరకు వార్తలొచ్చాయి. అయితే తాజాగా అండర్ కవర్ పోలీస్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. గతంలో మహేష్ ‘పోకిరి’, ‘దూకుడు’, ‘ఆగడు’ చిత్రాల్లో పోలీస్‌గా […]
అనవసర విషయాల గురించి ఆలోచించి వ్యాక్సిన్ వేయిచుకోకుండా ఉండొద్దని చెబుతున్నారు నటి వరలక్ష్మీ శరత్ కుమార్. అలాగే తాను ఫస్ట్ డోస్ వ్యాక్సిన్‌ను తీసుకున్నట్లుగా ఒక వీడియో ద్వారా తెలిపారు. ‘వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడవద్దు. ఊదాహరణకు బైక్‌పై వెళ్లేవారు ఊహించని ప్రమాదాన్ని ఆపలేరు. కానీ వారు హెల్మెట్ ధరించినట్లయితే ప్రాణాలను కాపాడుకోవచ్చు. వ్యాక్సిన్ కూడా అంతే. వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాన కరోనా రాదని కాదు. కానీ వ్యాక్సిన్ వేయించుకున్నట్లయితే కరోనా తీవ్రత మనలో తక్కువగా ఉంటుంది. ప్రాణాలకు […]
ఎల్బీనగర్ లో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ఓ వ్యాపారిని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మాడ్గుల మండలం పాత బ్రాహ్మణపల్లికి చెందిన వెంకటయ్య వినాయక ట్రేడర్స్ పేరుతో విత్తనాల విక్రయ వ్యాపారం చేస్తున్నాడు. పక్కా సమాచారం మేరకు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు & మాడ్గుల పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. దాదాపు 25 వేల ఎకరాల విస్తీర్ణానికి సరిపోయే విత్తనాలు వినాయక ట్రేడర్స్‌లో బయటపడ్డాయి. 43 లక్షల విలువ చేసే 2835 కిలోల పత్తి విత్తనాల ప్యాకెట్లను […]
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘రాధేశ్యామ్’.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అయితే జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు మేకర్స్ అధికారకంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకటించిన తేదీకే రాధేశ్యామ్ విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్న దర్శక, నిర్మాతలు ఇటీవల బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే’ సినిమాని ఫాలో అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. […]