బాలీవుడ్ తెరపైకి… వివాదాస్పద వ్యాపారవేత్త!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ లో బయోపిక్స్ జాతర ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు. ఎప్పటికప్పుడూ కొత్త బయోపిక్ ప్రాజెక్ట్స్ ప్రకటిస్తోన్న బీ-టౌన్ ఫిల్మ్ మేకర్స్, తాజాగా, సహారా సంస్థ చైర్మన్ సుబ్రతా రాయ్ జీవితంపై దృష్టి పెట్టారు. జూన్ 10న ఆయన 73వ జన్మదినం సందర్భంగా మూవీ అనౌన్స్ చేయనున్నారట. అయితే, బాలీవుడ్ లో ఈ టాక్ వినిపిస్తున్నప్పటికీ… దర్శకనిర్మాతలు ఎవరు? నటీనటుల వివరాలేంటి? మొదలైన అంశాలేవీ ఇంకా బయటకు రావటం లేదు. జూన్ 10వ తేదీనే సమాచారం మొత్తం వెలువడే అవకాశం ఉంది.
సుబ్రతా రాయ్ జీవితం, ఆర్దిక పరమైన వివాదాలు, ఆరోపణల మీద ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ రూపొందించింది. ‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్’ పేరుతో డాక్యుసిరీస్ స్ట్రీమింగ్ చేసిన నెట్ ఫ్లిక్స్ సహారా అధినేత మీద కూడా ఓ డాక్యుమెంటరీ సమర్పించింది. అయితే, అది మొత్తం దురుద్దేశంతో తీశారని సహారా సంస్థ స్టేట్మెంట్ ఇచ్చింది. అందులో చూపినవన్నీ తప్పులని ఖండించింది.
సహారా ఎయిర్ లైన్స్, లండన్ , న్యూ యార్క్ లో విలాసవంతమైన హోటల్స్, ఫార్ములా వన్ టీమ్, క్రికెట్ టీమ్… ఇలా పలు రకాల వ్యాపారాలతో ఓ వెలుగు వెలిగిన సుబ్రతా రాయ్ 2012 తరువాత కోర్టులు, జైలు జీవితంతో వివాదాలపాలయ్యాడు. ఆయనపై సెబీ ఆర్దిక నేరాల్ని ఆరోపిస్తూ కోర్టుకు వెళ్లింది. దాంతో రెండేళ్లు తీహార్ జైల్లో ఉన్నాడు రాయ్. ప్రస్తుతం పెరోల్ మీద బయట ఉన్న ఆయన సహారా సంస్థకి చైర్మన్ గా కొనసాగుతున్నాడు. మరి బోలెడంత గ్లామర్, గ్లిట్టర్ అండ్ కాంట్రవర్సీ ఉన్న సుబ్రతా రాయ్ జీవితం బాలీవుడ్ ఎలా చిత్రీకరిస్తుందో… చూడాలి!
Also Read
తాజావార్తలు
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!