అందాల తార కియారా అద్వానీ వరల్డ్ ఎన్విరాన్ మెంట్ డే ను పురస్కరించుకుని, ఆ మర్నాడు ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రతిరోజూ వరల్డ్ ఎన్విరాన్ మెంట్ డే నే! అంటూ ఈ వీడియోకు కాప్షన్ పెట్టింది కియారా. దానికి వారం ముందు అలలను మనం ఆపలేం… అయితే ఈత నేర్చుకోవచ్చు అంటూ గతంలో బికినీ వేసుకుని సాగరంలో స్విమ్ చేస్తున్న ఫోటోను పోస్ట్ చేసింది. అందాల సుందరి ఇలా […]
నటి సంజనా గల్రానీ ఆదివారం బెంగళూరులో కొవీషీల్డ్ వాక్సిన్ వేయించుకుంది. ఈ సందర్భంగా అక్కడి వైద్య సిబ్బంది సేవలు చూసి ఫిదా అయిపోయింది సంజనా. వారి అంకిత భావం చూస్తుంటే గర్వంగా ఉందంటూ పొగిడేసింది. అంతేకాదు… ఎవరైనా కొవీషీల్డ్ వాక్సిన్ వేయించుకోవాలనుకుంటే ఉచితంగా అందించడానికి తాను సిద్ధమని, సంజనా ఫౌండేషన్ కు మెయిల్ ద్వారా వివరాలు తెలియచేస్తే వారికి వాక్సిన్ వేయిస్తామని హామీ ఇస్తోంది. ఇటీవల కూడా సంజనా కరోనా బాధితులకు ఆహారాన్ని అందించడంతో పాటు సినీ […]
ఆదివారం ఉదయం అనారోగ్యంతో హిందూజా హస్పిటల్ లోని నాన్ కొవిడ్ వార్డ్ లో చేరిన లెజండరీ యాక్టర్ దిలీప్ కుమార్ కు ఆక్సిజన్ సపోర్ట్ తో వైద్యం చేస్తున్నామని డాక్టర్ నితిన్ గోఖలే తెలిపారు. గత కొంతకాలంగా డాక్టర్ నితిన్ నేతృత్వంలోని వైద్య బృందమే దిలీప్ కుమార్ కు వైద్య సేవలు అందిస్తోంది. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్న దిలీప్ కుమార్ ను ఈ ఉదయం హాస్పిటల్ లో చేర్చించారు. ఆ విషయాన్ని ఆయన అధికారిక ట్విట్టర్ […]
ఇంతకుముందులా కరోనా సోకిన పేషెంట్లు.. సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండటం లేదు. చాలా మంది వ్యక్తులు కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. భౌతిక దూరం కూడా పాటించడం లేదు. కరోనా సోకినా కూడా బయటకు వస్తున్నారు. మరికొందరైతే తన వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. తాజాగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కోవిడ్ పాజిటివ్ పేషెంట్ లు విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. ఓ మహిళ కు కోవిడ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చినప్పటికీ ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో […]
శోభన్ ను హీరోగా పరిచయం చేస్తూ రమేష్, గోపి దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాలుగో చిత్రం ఆదివారం పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఎస్పీ క్రియేషన్ బ్యానర్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా ప్రారంభోత్సవంలో రచ్చ రవి, హీరో రామన్, విక్రమ్, చంద్ర వట్టికూటి, మోహన్, మధు పగడాల, డాక్టర్ కృష్ణమూర్తి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.ఈ సినిమా గురించి దర్శకులు వివరాలు తెలియచేస్తూ ”మేము దర్శకత్వం వహిస్తున్న నాలుగో సినిమా ఇది. ఇదివరకు హీరో తరుణ్ తో “ఇది నా లవ్ స్టోరీ”, […]
నేడు కన్నడ నటుడు రక్షిత్‌శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘777 చార్లీ’ సినిమా టీజర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ఈ టీజర్‌ను నేచురల్ స్టార్ నాని విడుదల చేస్తూ.. టీజర్ క్యూట్‌గా ఉందని పేర్కొన్నారు. కాగా ఇందులో టైటిల్ రోల్ కుక్కదే కావడం విశేషం. టీజర్ మొత్తం ఆ కుక్క చుట్టూనే తిరిగింది. తిండి కోసం ఆ కుక్క పడే కష్టాలను చూపించి, చివరగా ధర్మ అనే హీరో చార్లీని తీసుకెళ్తున్న దృశ్యం […]
‘బిగ్‌బాస్’ ఫేమ్ భానుశ్రీ ప్రధాన పాత్రలో డి. రామకృష్ణ (ఆర్.కె) దర్శకత్వంలో మేకా హేమసుందర్ (మేకా ప్రసాద్) నిర్మిస్తోన్న చిత్రం ‘సర్వే నెం.3’. ఓ ప్రముఖ హీరో గెస్ట్ పాత్రలో నటించనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి నిర్మాతలు డి. నరేందర్, బెల్లంకొండ సురేష్ హాజరై చిత్రయూనిట్‌ను ఆశీర్వదించారు.నిర్మాత మేకా హేమసుందర్ మాట్లాడుతూ.. ‘ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. ఇది నాకు రెండో సినిమా. ఈ కరోనా […]
నిన్న (శనివారం) ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌తో పాటు పలువురి ప్రముఖుల ఖాతాలకు ట్విట్టర్ బ్లూ టిక్ ను తొలగించింది. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కొద్ది గంటల అనంతరం వాటిని పునరుద్ధరించింది ట్విట్టర్. కాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దీనిపై ఎద్దేవా చేశారు. దేశంలో వ్యాక్సిన్ల కోసం ప్రజలు అల్లాడుతుంటే.. కేంద్రం మాత్రం ట్విట్టర్ బ్లూ టిక్ మార్క్ కోసం తాపత్రయ పడుతోందన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం […]
1990’ల కాలంలో ‘మిస్టర్ బీన్’ క్యారెక్టర్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు రోవాన్ ఎట్కిన్‌సన్. తాజాగా మిస్టర్ బీన్ అలియాస్ రోవాన్ ఎట్కిన్‌సన్ చనిపోయాడంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఫేస్బుక్ ఫేక్ పేజ్‌లో మే 29న నటుడు రోవాన్ ఎట్కిన్‌సన్ చనిపోయాడని పోస్ట్ పెట్టారు. ఇది నిజమని తెలుసుకొని చాలా మంది షేర్ చేశారు. ఆ ఫేక్ అకౌంట్ కి చాలామంది ఫాలోయర్స్ ఉండటంతో అదే నిజమనుకున్నారు. కాగా అది తప్పుడు వార్త అని తెలియడంతో నెటిజన్స్ బోగస్ […]
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో జడ్పీ చైర్మన్ పుట్ట మధు మీడియా సమావేశం నిర్వహించారు. ఈమేరకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కవిత, సంతోష్ రావులపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన విమర్శలను పుట్ట మధు ఖండించారు. మంథని నియోజకవర్గంలో చీకటి పాలనను అంతమొందించడానికి కవిత చేసిన కృషి మరువలేమన్నారు. కవిత ఏనాడు ముఖ్యమంత్రి కూతురుగా కాకుండా ప్రజల పక్షాన ఉంది, ప్రజల కోసం పనిచేస్తుందన్నారు. సమస్యలపై స్పందించే విధానాన్ని చూసి టిబిజికెఎస్ నేతలు […]