నేడు కన్నడ నటుడు రక్షిత్‌శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘777 చార్లీ’ సినిమా టీజర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ఈ టీజర్‌ను నేచురల్ స్టార్ నాని విడుదల చేస్తూ.. టీజర్ క్యూట్‌గా ఉందని పేర్కొన్నారు. కాగా ఇందులో టైటిల్ రోల్ కుక్కదే కావడం విశేషం. టీజర్ మొత్తం ఆ కుక్క చుట్టూనే తిరిగింది. తిండి కోసం ఆ కుక్క పడే కష్టాలను చూపించి, చివరగా ధర్మ అనే హీరో చార్లీని తీసుకెళ్తున్న దృశ్యం చూపించారు. ధర్మను చార్లీ కలిశాక జరిగే ఉత్కంఠభరిత ప్రయాణమే ఈ సినిమా అని సంకేతాలు ఇచ్చారు. మరి ఆ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.