అందాల తార కియారా అద్వానీ వరల్డ్ ఎన్విరాన్ మెంట్ డే ను పురస్కరించుకుని, ఆ మర్నాడు ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రతిరోజూ వరల్డ్ ఎన్విరాన్ మెంట్ డే నే! అంటూ ఈ వీడియోకు కాప్షన్ పెట్టింది కియారా. దానికి వారం ముందు అలలను మనం ఆపలేం… అయితే ఈత నేర్చుకోవచ్చు అంటూ గతంలో బికినీ వేసుకుని సాగరంలో స్విమ్ చేస్తున్న ఫోటోను పోస్ట్ చేసింది. అందాల సుందరి ఇలా వీడియోను పోస్ట్ చేసిందో లేదో… అలా అది వైరల్ అయిపోవడం మొదలైంది. తొలి గంటలోనే దాదాపు తొమ్మిది లక్షల మంది దానిని చూసి ఎంజాయ్ చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే… హిందీలో షేర్షా
, భోల్ బులయ్యా -2
తో పాటు మరో రెండు సినిమాలలో నటిస్తోంది.