దక్షిణాఫ్రికా సీనియర్ ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్ బౌండరీ లైన్ దగ్గర మరో ఆటగాడు మహమ్మద్ హస్‌నెయిన్‌ను గట్టిగా ఢీ కొట్టడంతో స్పృహ కోల్పోయాడు. పాకిస్థాన్ సూపర్‌లీగ్ టోర్నీలో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావర్ జల్మి జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. హసనెయిన్ మోకాలు డు ప్లెసిస్ తలకి బలంగా తాకడంతో కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో అందరు ఒక్కసారిగా ఆందోళన చెందారు. ఆసుపత్రిలో ఆయనకు స్కానింగ్ తీసిన […]
టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ బాలీవుడ్ లోకి రీమేక్ అవుతుందన్న వార్తలు వినిపిస్తూనే వున్నా ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా ఈ తెలుగు సినిమా రీమేక్ లో నటించడానికి కార్తీక్ ఆర్యన్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కథానాయికగా నటించనుందట. ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం బడా నిర్మాతలు పోటీపడుతున్నారు. అయితే ఇటీవలే ఓ నిర్మాత అల్లు అరవింద్ ను కలిసి ఓ నిర్ణయానికి వచ్చినట్లు […]
ప్రశాంత్ కిషోర్ తెలుగు వాళ్లకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయ వ్యహకర్తగా పలు రాష్ట్రాల్లో పలానా పార్టీని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టడంలో ఆయన పాత్ర ప్రత్యేకం. నరేంద్ర మోదీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మమత బెనర్జీ.. ఇలా చాలా మందిని అగ్రపీఠంలో కూర్చోబెట్టాడు. అయితే తాజాగా ఆయన జీవితం ఆధారంగా ఓ వెబ్ సిరీస్ చేయాలని బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ప్లాన్ చేస్తున్నారట. తాజాగా షారుక్ పీకేతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే షూటింగ్స్ పునప్రారంభం కానుండడంతో ప్రభాస్ తిరిగి బిజీ కానున్నాడు. రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ లాంటి భారీ సినిమాలతో ప్రభాస్ మరోసారి బాలీవుడ్ అభిమానులను సైతం ఆకర్షించాడు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంలోనూ ప్రభాస్ నటించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనుంది. కథానాయికగా బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా […]
తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ విషయంలోనూ ఈషా ఏమాత్రం తగ్గకుండా నటిస్తోంది. సోషల్ మీడియాలోనూ హాట్ నెస్ తో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక ఆమె నటించిన ‘రాగల 24 గంటల్లో’ సినిమా ఈషాకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ‘అరవింద సమేత’లో మెరిసిన ఈ బ్యూటీ, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమాలోను నటిస్తోంది. తాజాగా ఈషా మలయాళంలో సినిమాలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. […]
మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందారం గ్రామం శివారులో జైపూర్ ఎస్సై రామకృష్ణ తన సిబ్బందితో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇందారం IK-1A ఓపెన్ కాస్ట్ మైన్ నుంచి బొగ్గు తీసుకెళ్తున్న లారీలను తనిఖీలు చేశారు. ఎలాంటి టార్పాలిన్లు కట్టకుండా మరియు అతివేగంగా వెళ్తున్న 8 లారీలకు రూ.10,400 జరిమానా విధించారు. అయితే గతంలోనూ చాలా సందర్భాల్లో హెచ్చరించిన వినకపోవడంతో ఫైన్ వేశారు. ఇక నుండి టార్పాలిన్ కట్టకుండా, అతి వేగంగా నడిపి ప్రమాదాలకు […]
భార్య ప్రియుడితో కలిసి ఉండగా భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. భైంసా పట్టణంలోని ఏ.పి నగర్ కాలనీలో ప్రియుడితో కలిసి ఉండగా భర్తకు రెడ్ హ్యాండెడ్ గా భార్య దొరికింది. కాగా భార్య, ప్రియుడిని గదిలో ఉండగా బయటి నుండి తాళం వేసిన భర్త రాజు అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే చాలా సేపు బయటకి రాకుండా లోపలే గడియ పెట్టుకుని పోలీసులకు చుక్కలు చూపించారు. ప్రస్తుతం ఆ […]
మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ మరియు జైపూర్ మండలంలో కోడిపందాలు, పేకాట యథేచ్ఛగా నడుస్తుంది. పక్క సమాచారంతో జిల్లా పోలీసులు వారిని పరుగెత్తించారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీరాంపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగపూర్ గ్రామ శివారులో కోడిపందెం స్థావరంపై పొలీసులు దాడి చేశారు. ఈ ఆకస్మిక దాడిలో ముగ్గురు అరెస్ట్ కాగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వీరి వద్ద నుంచి రూ. 3, 500 నగదు, రెండు పందెం కోళ్లు, 11 కోళ్లకు కట్టే కత్తులు, రెండు […]
ఫోటో అంటే… చరిత్రలో ఓ క్షణాన్ని అలా బంధించి, భద్రంగా దాచి పెట్టటం! సెల్ ఫోన్లు, మొబైల్ కెమెరాలు వచ్చాక… ఇప్పుడంటే ఛాయాచిత్రల స్థాయి కాస్త తగ్గిపోయిందిగానీ… ఒకప్పుడు అవి అమూల్యం! అటువంటి ఒక ఫ్లాష్ బ్యాక్ పిక్ తమిళ కమెడియన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్త్ మనోబాల ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఆయన నెటిజన్స్ తో పంచుకున్న ఫోటోకి ‘విత్ మై డైరెక్టర్ అండ్ అరుణ’ అని క్యాప్షన్ రాశాడు.ఇంతకీ, మనోబాల షేర్ చేసిన ఫోటో […]