బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఢాకా ప్రీమియర్ లీగ్‌లో ఆజట్టు మాజీ కెప్టెన్ షకీబల్ హసన్ సహనం కోల్పోయి అతిగా ప్రవర్తించాడు. రెండుసార్లు ఫీల్డ్ అంపైర్‌తో గొడవకు దిగాడు. మహ్మడన్ స్పోర్టింగ్ క్లబ్ కెప్టెన్ షకీబల్.. తన బౌలింగ్‌లో అబానీ లిమిటెడ్ జట్టు బ్యాట్స్‌మన్ ఎల్బీకోసం అప్పీల్ చేశాడు. అయితే అంపైర్ అప్పీల్‌ను తిరస్కరించడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన షకీబల్ వికెట్లను తన్నాడు. అంతటితో ఆగకుండా అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహంతో వికెట్లను పీకి నేలకేసి కొట్టాడు.
ఎన్నో అంతర్జాతీయ మ్యాచులు ఆడిన అనుభవం ఉన్న షకీబల్ ప్రవర్తనపై అభిమానులు సోషల్‌మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆ తర్వాత తన తప్పు తెలుసుకున్న షకీబ్ క్షమాపణలు చెప్పాడు. అయితే తాజాగా షకీబల్‌పై వేటు వేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. మూడు మ్యాచ్‌ల నిషేధంతోపాటు 5,800 డాలర్ల జరిమానా విధించింది. ఇంతకంటే కఠిన చర్యలు ఉంటాయని భావించిన సీరియస్ గా హెచ్చరించి వదిలేసింది.