భార్య ప్రియుడితో కలిసి ఉండగా భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. భైంసా పట్టణంలోని ఏ.పి నగర్ కాలనీలో ప్రియుడితో కలిసి ఉండగా భర్తకు రెడ్ హ్యాండెడ్ గా భార్య దొరికింది. కాగా భార్య, ప్రియుడిని గదిలో ఉండగా బయటి నుండి తాళం వేసిన భర్త రాజు అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే చాలా సేపు బయటకి రాకుండా లోపలే గడియ పెట్టుకుని పోలీసులకు చుక్కలు చూపించారు. ప్రస్తుతం ఆ జంటను అదుపులోకి తీసుకున్న పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
పెళ్లి జరిగిన తరువాత కూడా తన భార్య ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న భర్త భార్యకు అనేకసార్లు వార్నింగ్ ఇచ్చాడు. భర్త హెచ్చరికలను భార్య వినలేదు. దీంతో భార్య, ఆమె ప్రియుడు భర్తకు బెడ్‌రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు.