టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ బాలీవుడ్ లోకి రీమేక్ అవుతుందన్న వార్తలు వినిపిస్తూనే వున్నా ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా ఈ తెలుగు సినిమా రీమేక్ లో నటించడానికి కార్తీక్ ఆర్యన్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కథానాయికగా నటించనుందట. ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం బడా నిర్మాతలు పోటీపడుతున్నారు. అయితే ఇటీవలే ఓ నిర్మాత అల్లు అరవింద్ ను కలిసి ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. త్వరలోనే ప్రకటన రానుందని తెలుస్తోంది. అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది. బన్నీ సరసన పూజా హెగ్డే నటించగా.. తమన్ సంగీతం ఈ సినిమాలో హైలైట్ గా నిలిచింది.