ప్రముఖ కన్నడ నటుడు యశ్ ‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. అతనితో సినిమాలు చేయడానికి పలువురు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. అయితే కన్నడ చిత్రం ‘ముఫ్తీ’ ఫేమ్ నార్తన్ తో యశ్ ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త కొంతకాలంగా శాండిల్ వుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఆ విషయాన్ని నార్తన్ సైతం కన్ ఫామ్ చేశాడు. రెండేళ్ళుగా యశ్ తో తాను ట్రావెల్ చేస్తున్నానని, తాను చెప్పిన లైన్ నచ్చి […]
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమా ‘ఎఫ్ 3’. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ’ఎఫ్ 2’ సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ సినిమాని డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. త్వరలోనే తదుపరి షెడ్యూలు షూటింగును ప్రారంభించనున్నారు. కాగా, ఓ ప్రత్యేకమైన పాట కోసం కథానాయిక ప్రగ్యా జైస్వాల్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈమేరకు […]
ఇటీవలే యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన ‘ఏక్ మినీ కథ’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ అడల్ట్ కామెడీ మూవీ తర్వాత వరుసగా సంతోష్ కు ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే మారుతీ దర్శకత్వంలో ఓటీటీ మూవీకి సంతోష్ కమిట్ అయ్యాడు. అలానే ‘ప్రేమకుమార్’ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. కొన్ని వెబ్ సీరిస్ లలో నటించడానికి చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే… తాజాగా మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత… సంతోష్ శోభన్ […]
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘అల వైకుంఠపురంలో’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను బాలీవుడ్ లోకి దర్శకుడు డేవిడ్ ధావన్ రీమేక్ చేయనున్నారు. కార్తీక్ ఆర్యన్-కృతిసనన్ హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. హిందీ రీమేక్ వెర్షన్ కు అల్లు అరవింద్ సహా నిర్మాతగా వ్యవహరించనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కీలకపాత్రలో నటించిన టబు పాత్రలో బాలీవుడ్‌లో మనీషా కొయిరాల చేయనుందట. […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు వరంగల్, యాదాద్రి జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అత్యంత ఆధునిక వైద్య సేవలతో ఏర్పాటు చేయనున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్, ఆరోగ్య విశ్వవిద్యాలయం నూతన భవనాలను ప్రారంభించనున్నారు. నేడు వరంగల్ జిల్లా పర్యటన ముగించుకుని కేసీఆర్ యాదాద్రికి చేరుకుంటారు. ఇప్పటికే యాదాద్రి నూతన ఆలయ పునర్నిర్మాణాల పనులను […]
(జూన్ 21న ‘మధురానగరిలో…’కు 30 ఏళ్ళు) భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత ఎస్. గోపాలరెడ్డికి ‘ఎమ్’ సెంటిమెంట్ లెటర్ అని చెప్పాలి. ఆయన నిర్మించిన ‘మనిషికో చరిత్ర, ముక్కుపుడక, మంగమ్మగారి మనవడు, మాపల్లెలో గోపాలుడు, ముద్దుల క్రిష్ణయ్య, మువ్వగోపాలుడు, మురళీకృష్ణుడు, మన్నెంలో మొనగాడు, ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు, మాతో పెట్టుకోకు’ చిత్రాలన్నీ అలా ‘మ’ అక్షరంతో మొదలయినవే. వాటిలో బాలకృష్ణతో తెరకెక్కించిన చిత్రాల్లో ఒకటి రెండు మినహా అన్నీ బంపర్ హిట్స్, ఇక యాక్షన్ హీరో […]
సిఐపై అవినీతి ఆరోపణలు తూర్పుగోదావరి జిల్లాలోని ఎటపాక సిఐ గీతారామకృష్ణను వి.ఆర్.కు తరలించారు. సారా కేసులో డబ్బులు తీసుకున్నట్లు సిఐ గీతారామకృష్ణ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈమేరకు డిఎస్పీ ఖాదర్ బాషా విచారణ చేపట్టారు. తాత్కాలికంగా ఎటపాక సిఐగా గజేంద్ర రానున్నారు. 50 ఆర్టీసీ బస్సు సర్వీసులు పెంపు తూర్పుగోదావరి జిల్లాలో రేపటి నుండి మరో 50 ఆర్టీసీ బస్సు సర్వీసులు పెంచారు. ప్రస్తుతం ఆయా రూట్లలో 270 బస్సులు నడుపుతుండగా వీటి సంఖ్యను 320కి పెంచారు. […]
పెళ్లి పత్రికలో పేర్ల కోసం జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారితీసిన ఘటన సికింద్రాబాద్ తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ నగర్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు.వివరాలలోకి వెళితే… మూడు రోజుల క్రితం చంద్రశేఖర్ నగర్ కు చెందిన సురేష్ వివాహం జరిగింది.. అయితే పెళ్లి పత్రికలలో తమ పేర్లు ఎందుకు పెట్టలేదని పెళ్లి రోజే సర్వేశ్ కుటుంబ సభ్యులతో గొడవకు దిగాడు..సురేష్ […]
తెలంగాణలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు నివేదిక అందించారు. ఈ నివేదికలను పరిశీలించిన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు పూర్తిస్థాయి లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక సినీప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా థియేటర్లు కూడా […]
మేష రాశి: కుటుంబ విషయాలలో మాటపడాల్సి వస్తుంది. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. శత్రువులు, మిత్రులుగా మారతారు. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల వల్ల నష్టపోయే ఆస్కారం వుంది. జాగ్రత్త వహించండి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. వృషభరాశి: ఉద్యోగస్తుల శక్తిసామర్థ్యాలు అధికారులు గుర్తిస్తారు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. రాజకీయ నాయకులకు పదవీ సమస్యలు అధికమవుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. […]