టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘అల వైకుంఠపురంలో’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను బాలీవుడ్ లోకి దర్శకుడు డేవిడ్ ధావన్ రీమేక్ చేయనున్నారు. కార్తీక్ ఆర్యన్-కృతిసనన్ హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. హిందీ రీమేక్ వెర్షన్ కు అల్లు అరవింద్ సహా నిర్మాతగా వ్యవహరించనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కీలకపాత్రలో నటించిన టబు పాత్రలో బాలీవుడ్‌లో మనీషా కొయిరాల చేయనుందట. ఈమేరకు ఆమెతో చర్చలు జరిగి ఒప్పించారని సమాచారం. అయితే హిందీ వెర్షన్ లో కూడా టబునే తీసుకుందామని ప్రయత్నాలు జరుగగా ఆమె డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆ ఛాన్స్ మనీషా కొయిరాలకు దక్కిందని తెలుస్తోంది.