జూన్ 20, ఆదివారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేష రాశి: కుటుంబ విషయాలలో మాటపడాల్సి వస్తుంది. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. శత్రువులు, మిత్రులుగా మారతారు. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల వల్ల నష్టపోయే ఆస్కారం వుంది. జాగ్రత్త వహించండి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
వృషభరాశి: ఉద్యోగస్తుల శక్తిసామర్థ్యాలు అధికారులు గుర్తిస్తారు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. రాజకీయ నాయకులకు పదవీ సమస్యలు అధికమవుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు.
Also Read
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
- Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
మిధునరాశి: ఆర్థిక, కుటుంబ సమస్యలకు చక్కని పరిష్కారమార్గం గోచరిస్తుంది. మీ మాటకు సర్వత్రా మంచి స్పందన లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దుబారా ఖర్చులు నివారించాలన్న మీ యత్నం ఫలించదు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటుంది. కానివేళలో బంధు మిత్రుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.
కర్కాటకరాశి: మీ అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. కలప, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. మార్కెట్ రంగాల వారు టార్గెట్లను సునాయాసంగా పూర్తిచేస్తారు.
సింహరాశి: ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి వేధింపులు అధికంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బందులను కలిగిస్తాయి. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. బేకరీ, స్వీట్స్ తినుబండారు వ్యాపారులకు, తయారీదారులకు ఒత్తిడి పెరుగుతుంది. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది.
కన్యరాశి: కొబ్బరి, మామిడి, పండ్లు, పూల, కూరగాయ రంగాలలో వారికి అనుకూలమైన కాలం. ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి. ప్రముఖులను కలుసుకుంటారు. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తుటకు ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.
తులరాశి: నరాలు, తల, ఎముకలకి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆటుపోట్లు తొలగి పురోభివృద్ధి సాధిస్తారు. గృహంలో మార్పులు, చేర్పులు త్వరలో అనుకూలిస్తాయి. స్త్రీలకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయాలలోని వారికి సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు.
వృశ్చికరాశి: బంధు మిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. వాతావరణంలో మార్పు మీ పనులకు ఆటంకమవుతుంది. మీ అభిప్రాయాలకు కుటుంబీకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఏమాత్రం పొదుపు సాధ్యం కాదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. వాహన చోదకులకు చికాకులు అధికం.
ధనస్సురాశి: సభలు, సమావేశాలకు ధనం అధికంగా వ్యయం చేస్తారు. విద్యార్థులకు క్రీడా రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. చిన్ననాటి మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. రాజకీయాలలో వారికి సంఘంలో స్థాయిల పెరగగలదు. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
మకరరాశి: విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు ఊరట కలిగిస్తాయి. భాగస్వామిక వ్యాపారాలు ఉమ్మడి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. సోదరీ, సోదరుల మధ్య పోరు అధికంగా ఉంటుంది. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిసాయి.
కుంభరాశి: అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విజయం సాధించిన రోజు దూరమైన వారు తప్పక మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. పీచు, ఫోం, లెదర్, వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. భార్య, భర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. బ్యాంకింగ్ రంగాల వారికి పనిభారం, చికాకులను ఎదుర్కొంటారు.
మీనరాశి: పాత మిత్రుల కలయిక మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను సమర్థంగా ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు, పత్రికా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. మీ ఏమరుపాటుతనం వల్ల ధన నష్టం, విలువైన వస్తువులు చేజారిపోవడం వంటి చికాకులు ఎదుర్కొంటారు. ప్రయాణాలు అనుకూలం.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?