జాతీయ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్న విద్యాబాలన్ గత యేడాది మేథమెటీషియన్ శకుంతల దేవి బయోపిక్ లో నటించారు. అది ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ యేడాది కూడా డాక్యూ డ్రామాను తలపించే ‘షేర్నీ’ మూవీలో ఆమె యాక్ట్ చేశారు. గత శుక్రవారం నుండి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 2018లో మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో అవని (టి 1) అనే ఆడపులి దాదాపు పదమూడు మందిపై దాడి చేసి చంపేసింది. ఆ […]
‘కేజిఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా ఫేమ్ ను సంపాదించుకున్నాడు యష్. ఆఒక్క చిత్రంతో రాకీభాయ్ క్రేజ్ పెరిగిపోయింది. కాగా అమధ్యే ‘కేజిఎఫ్ చాప్టర్ 2’ షూటింగ్ ను కూడా పూర్తి చేశాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. అయితే కేజిఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ పూర్తి చేసి నెలలు గడుస్తున్న రాకీభాయ్ చేయబోయే తదుపరి చిత్రంపై ఇంకా క్లారిటీ రాలేదు. కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్ రావడంతో పూర్తిగా ఫ్యామిలీతోనే గడిపేశాడు యష్. అయితే […]
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో దాదాపు 11 ఏళ్ల తర్వాత సినిమా చేయబోతున్నాడు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరూ కాంబినేషన్ వస్తుండటంతో ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అధికారికంగా ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినప్పటికీ.. జులైలో పూజా కార్యక్రమాలు ప్రారంభించనున్నారట. కాగా ఆగష్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుందని సమాచారం. మరోవైపు మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా […]
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు సిద్దిపేటలో కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ను ప్రారంభించనున్నారు. ఆతర్వాత సిద్దిపేట పట్టణ శివారులో పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని కూడా సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులతో మంత్రి హరీష్ రావు.. […]
దేశవ్యాప్తంగా రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి ఇంధన ధరలు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురుపై కేంద్ర, రాష్ట్రాలు పన్నులు విధించడంతో పెట్రోల్, డీజీల్ ధరలు సెంచరీ దాటేశాయి. పెరుగుతోన్నఇంధన ధరలతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా లీటర్ పెట్రోల్ పై రూ.30 పైసలు, డీజిల్ పై రూ.31 పైసలు పెరిగాయి. పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ. 96.04గా ఉంది. మే 4 […]
తెలంగాణలో కేసులు తగ్గుముఖం పడుతుండటంతో లాక్‌డౌన్ ఎత్తివేసింది ప్రభుత్వం. దీంతో హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. నేటి నుంచి ప్రయాణికులకు పూర్తిస్థాయిలో మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు రీషెడ్యూల్ సమయాన్ని హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 వరకూ మెట్రో రైలు సర్వీసులు నడవనున్నాయి. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతికదూరం నిబంధనలు పాటించాలని మెట్రో అధికారులు కోరారు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని […]
(జూన్ 20తో ‘గడసరి అత్త -సొగసరి కోడలు’కు 40 ఏళ్ళు) బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతీ రామకృష్ణ ‘గడసరి అత్త’గా, శ్రీదేవి ‘సొగసరి కోడలు’గా నటించిన చిత్రంలో కృష్ణ కథానాయకుడు. అంతకు ముందు కృష్ణతో ‘వియ్యాలవారి కయ్యాలు’ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన కట్టా సుబ్బారావు ఈ ‘గడసరి అత్త-సొగసరి కోడలు’ రూపొందించారు. 1981 జూన్ 20న విడుదలైన ఈ చిత్రం జనాన్ని బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే – భర్తను బలవంతపెట్టి, ఆస్తి […]
(జూన్ 20న ఫాదర్స్ డే) “నాన్న అనే రెండక్షరాలు… మరపురాని మధురాక్షరాలు…” అంటూ ‘దీక్ష’ చిత్రంలో ఘంటసాల గళం పల్లవించగా, నటరత్న అభినయంతో అలరించింది ఆ పాట. ఇక ‘ధర్మదాత’లో “ఓ నాన్నా… నీ మనసే వెన్న… అమృతం కన్నా… అది ఎంతో మిన్నా…” అంటూ మరోమారు ఘంటసాల గాత్రంలోనే ఆ గీతం జాలువారింది. నటసమ్రాట్ నటనతో ఆ పాట కూడా జనాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. “బృందావనమొక ఆలయమూ…మాధవుడందలి దైవమూ…” అంటూ ‘భలేకృష్ణుడు’లో బాలు గొంతులో సాగిన […]
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అత్యవసర ప్రాతిపదికన శనివారం మధ్యాహ్నం సమావేశమైన మంత్రివర్గం లౌక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ఎత్తివేసిన నేపథ్యంలో రేపటి నుండి వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల దర్శనాలు ప్రారంభం కానున్నాయని దేవస్థాన యాజమాన్యం తెలిపింది. గత నెల మే 12న ఆలయంలో భక్తుల దర్శనాలు నిలిపివేయగా.. 38 రోజుల అనంతరం భక్తుల దర్శనాలు ప్రారంభం కానున్నాయి. భద్రాచలం శ్రీ […]