మేగ్నమ్ ఓపస్ మూవీ, రియల్ మల్టీస్టారర్ ‘ట్రిపుల్ ఆర్’ రిలీజ్ డేట్ ను దర్శక ధీరుడు రాజమౌళి అధికారికంగా ప్రకటించాడు. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ట్రిపుల్ ఆర్’ మూవీని వచ్చే యేడాది జనవరి 7వ తేదీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా రాజమౌళి తెలిపాడు. ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాను జనవరి 7 ఎక్స్ పీరియన్స్ చేయొచ్చని రాజమౌళి ట్వీట్ లో పేర్కొన్నాడు. రిలీజ్ డేట్ ను […]
నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించని ఈ జంట.. తాజాగా సోషల్ మీడియా వేదికగా విడాకుల తీసుకుంటున్నట్లు ప్రకటించారు. సమంత, తాను విడిపోతున్నట్లు హీరో నాగచైతన్య ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘పదేళ్ల పాటు స్నేహంగా ఉండి ఒక్కటయ్యాం. అభిమానులంతా అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో స్నేహితులుగా కలిసి ఉంటాం. నాలుగేళ్ల వివాహబంధానికి తెరదించుతున్నాం’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇక వీరిద్దరూ కలిసి […]
హీరో గోపీచంద్ కబడ్డీ కోచ్ గా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్’ ఇటీవల విడుదలై కమర్షియల్ గా ఓకే అనిపించుకుంది. ఈ నేపథ్యంలో అతను నటించిన పాత చిత్రం ఒకటి జనం ముందుకు రాబోతోంది. నయనతార నాయికగా నటించిన ‘ఆరడుగుల బుల్లెట్’ చిత్రాన్ని బి. గోపాల్ దర్శకత్వంలో తాండ్ర రమేశ్ నిర్మించారు. దీనిని ఈ నెల 8న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత తెలిపారు. గోపీచంద్, నయనతార తొలిసారి జోడీ కట్టిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. […]
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని, అంతా సీఎం కేసీఆర్ చలువ వల్లనేనన్నారు ప్రముఖ సినీ నటుడు సుమన్. హైదరాబాద్ రామంతపూర్ లో జరిగిన ఎస్.ఎన్. ఎస్. డెవలపర్స్ నూతన వెంచర్ బ్రోచర్ ను నటుడు సుమన్ విడుదల చేశారు. యాదగిరిగుట్ట సమీపంలోని రాజపేట లో 50 ఎకరాలలో తమ ఆరవ వెంచర్ ఏర్పాటు చేస్తున్నామని, యాదాద్రి- కరీంనగర్ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న తమ వెంచర్ ఉంటుందని కస్టమర్లకు అన్నిరకాల సదుపాయాలతో తమ వెంచర్ […]
చూడముచ్చటైన జంట అంటూ వేనోళ్ళ కీర్తించిన నాగచైతన్య, సమంత జంట విడాకులు తీసుకుంది. గత కొద్ది రోజులుగా చైతూ, సామ్ విడిపోతారని వినిపిస్తూనే ఉంది. అయితే శనివారం అధికారికంగా వారిద్దరూ విడిపోయినట్టు నాగచైతన్య తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నాడు. ఆ వెంటనే సమంత సైతం తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ధ్రువీకరించింది. టాలీవుడ్ ఓ స్టార్ జంట విడిపోవడం కొత్తేమీ కాదు. సినిమా జంటలు పెళ్ళయ్యాక బ్రేకప్ అయినవి కొన్ని అయితే, కొందరు వివాహ […]
గత కొన్ని మాసాలుగా నాగా చైతన్య, సమంత విడాకులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో పాటు ప్రధాన వార్తా పత్రికల్లోనూ విశేషంగా చోటు చేసుకుంటున్నాయి. అయితే… ఈ మొత్తం వ్యవహారంలో నాగచైతన్య వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చాడు. సమంత మాత్రం సందర్భాను సారంగా అవుననో, కాదనో ఏదో ఒక రీతిలో హింట్ ఇస్తూ వస్తోంది. ఆమె నెట్ ఫ్లిక్స్ లో నటించబోతున్న ‘డైవోర్స్’ అనే వెబ్ సీరిస్ ప్రమోషన్ కోసమే సమంత ఇలాంటి ప్రచారాలు చేస్తోందనే వార్తలూ […]
నిర్మాత, దర్శకుడు సి.వి రెడ్డి ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సమాజంలోని సమస్యను తీసుకుని ఆలోచింపజేసేలా కథను తయారు చేసి ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. సీవీ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను ఎనిమిది సంవత్సరాల తరువాత నిర్మిస్తున్నారు. కరోనా టైమ్ లో కథను తయారు చేసుకున్న సివి రెడ్డి దీనికి ‘ఆఖరి ముద్దు’ అన్న పేరు నిర్ణయించారు. ఈ కథ తనని బాగా ప్రభావిత చేసిందని, ముఖ్యంగా సమాజానికి మార్గదర్శకం కావాలనే ఉద్దేశ్యంతో తీయబోతున్నట్లు చెబుతున్నారు. […]
భారతదేశంలో అత్యంత భారీ బడ్జెట్ సినిమా రజనీకాంత్, అక్షయ్‌కుమార్ నటించిన ‘2.0’ను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. అదొక్కటే కాదు. పలు భారీ బడ్జెట్, హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘రామ్ సేతు’తో హిందీ పరిశ్రమలోకి లైకా ప్రొడక్షన్స్ ప్రవేశిస్తోంది. అలానే శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కథానాయికగా ‘గుడ్ లక్ జెర్రీ’ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినిమా చేయడానికి లైకా ప్రొడక్షన్స్ సిద్ధమైంది. రజనీకాంత్ […]
ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎం.వై.మహర్షి నిర్మిస్తున్న చిత్రం ‘1948-అఖండ భారత్’. భారతీయ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. గాంధీజయంతి సందర్బంగా ఈ చిత్రం నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు. ఆలేఖ్య శెట్టి హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ చిత్రంలో గాంధీగా రఘనందన్, నాథురాం గోడ్సే గా డా. ఆర్యవర్ధన్ రాజ్, సర్ధార్ వల్లభాయ్ పటేల్ గా శరద్ దద్భావల, నెహ్రుగా ఇంతియాజ్, జిన్నాగా జెన్నీ, అబ్దుల్ గఫర్ […]