తెలుగులో రోడ్ జర్నీ మూవీస్ చాలా అరుదు. ఆ లోటును తీర్చడానికే కావచ్చు నూతన దర్శకుడు గురు పవన్ ‘ఇదే మా కథ’ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, భూమిక, తన్యా హోప్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను జి. మహేశ్ నిర్మించారు. గాంధీ జయంతి కానుకగా ‘ఇదే మా కథ’ అక్టోబర్ 2న జనం ముందుకు వచ్చింది. ఇదో నలుగురు వ్యక్తుల జీవిత కథ. యుక్త వయసులో లడక్ లో తనకు తారస […]
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’.. ఇదివరకు వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు భారీ హిట్స్ సాధించడంతో అఖండ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కరోనా వేవ్ తర్వాత శరవేగంగా జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ చివరిదశలో ఉండగా, రెండు పాటల షూటింగ్ బ్యాలన్స్ వుంది. ప్రస్తుతం చిత్రబృందం […]
‘మా’ అధ్యక్ష పదవి పోటీ నుంచి సీవీఎల్ నరసింహారావు తప్పుకొని బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈమేరకు ‘మా’ అధ్యక్ష పదవికి వేసిన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. అయితే ఈ ఉదయమే మ్యానిఫెస్టో ప్రకటించిన సీవీఎల్.. అనుహ్యంగా పోటీ నుంచి తప్పుకోవడంతో మరోసారి మా ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. ఇక ప్రకాష్ రాజ్-మంచు విష్ణు మధ్య పోటీ నెలకోంది. కాగా, ఇదివరకే జీవిత, హేమలు పోటీ నుంచి తప్పుకొని ప్రకాష్ రాజ్ ప్యానల్ లో చేరిన సంగతి తెలిసిందే.. […]
కోలీవుడ్ నటుడు శింబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మానాడు’.. తెలుగులో ‘ది లూప్’ పేరుతో వస్తోంది. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో వి.హౌస్ పతాకంపై సురేష్ కామాక్షి నిర్మిస్తున్నారు. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ముగిసింది. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను టాలీవుడ్ నటుడు నాని విడుదల చేశారు. దీపావళి సందర్బంగా థియేటర్లోకి తీసుకురానున్నట్లు ట్రైలర్ లో ప్రకటించారు. శింబుకి జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తుంది. ఇంకా ఎస్.జె. సూర్య, […]
మాస్ మహారాజా రవితేజ ‘క్రాక్’ సినిమా సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్నాడు. ఈ సినిమా తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. తాజాగా త్రినాథరావు నక్కిన ప్రాజెక్ట్ అప్డేట్ ను రవితేజ స్వయంగా ప్రకటించారు. ‘సినిమా చూపిస్తా మావ’, ‘నేను లోకల్’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ తన 69వ సినిమాను చేయనున్నాడు. ఈ నెల 4 నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈమేరకు రవితేజ.. రోల్-కెమెరా-యాక్షన్ […]
‘మా’ఎన్నికల్లో నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే.. మరోవైపు అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న సీవీఎల్ నరసింహారావు సైలెంట్ గా తన పని కానిస్తున్నాడు. ఈ క్రమములోనే ఆయన మ్యానిఫెస్టో విడుదల చేశారు. 2011 లో మనం పాస్ చేసుకున్న రిజల్యూషన్ నీ పర్ఫెక్ట్ గా అమలు చేయడం ప్రధానంగా ప్రస్తావించారు సీవీఎల్.. ఇది కనుక అమలు అయితే ఆర్టిస్టుల అందరికీ అవకాశాలు వస్తాయన్నారు. ఈ రిజల్యూషన్ పాస్ […]
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లక్నోలో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఈ సమావేశం చర్చనీయాంశంగా మారింది. ఇక కంగనా కూడా బీజేపీ భావజాలానికి మరింత దగ్గర అవుతున్న సంగతి తెలిసిందే. ఆమె రాజకీయ ప్రవేశం లేకున్నాను, మద్దతు తెలియజేసే అవకాశం కనిపిస్తోంది. యూపీ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, మహిళా భద్రతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కంగనా అభినందించారు. ఈ భేటీ […]
(అక్టోబర్ 2న ‘రాక్షసుడు’కు 35 ఏళ్ళు పూర్తి) తెలుగు సినిమా మూడోతరం కథానాయకుల్లో నవలానాయకుడు అన్న ఇమేజ్ సొంతం చేసుకున్నది మెగాస్టార్ చిరంజీవే! ఆయన నటించిన పలు నవలా చిత్రాలు విజయకేతనం ఎగురవేశాయి. చిరంజీవి, ఎ.కోదండరామిరెడ్డి, క్రియేటివ్ కమర్షియల్స్ కె.ఎస్.రామారావు, ఇళయరాజా, యండమూరి కాంబినేషన్ లో రూపొందిన నవలా చిత్రాలు తెలుగువారిని విశేషంగా మురిపించాయి. అంతకు ముందు ఈ కాంబినేషన్ లోనే రూపొందిన ‘అభిలాష’, ‘ఛాలెంజ్’ చిత్రాలు అటు మ్యూజికల్ హిట్స్ గానూ, ఇటు కమర్షియల్ సక్సెస్ […]
(అక్టోబర్ 2న ‘ఒకరాధ – ఇద్దరు కృష్ణులు’కు 35 ఏళ్ళు) ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ నవలలను పలుమార్లు సినిమాలుగా రూపొందించి విజయం సాధించారు దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి. ఈ నేపథ్యంలో యండమూరి రాసిన ‘ఒకరాధ ఇద్దరు కృష్ణులు’ నవలను అదే టైటిల్ తో రూపొందించారు. శ్రీసారసా మూవీస్ పతాకంపై తెరకెక్కిన ‘ఒక రాధ – ఇద్దరు కృష్ణులు’లో కమల్ హాసన్, శ్రీదేవి జంటగా నటించారు. 1986 అక్టోబర్ 2న విడుదలైన ‘ఒక రాధ – ఇద్దరు […]
(అక్టోబర్ 2న మహాత్మ గాంధీ జయంతి) భారతీయుల మదిలో అహింసామూర్తిగా గుడికట్టుకున్నారు మహాత్మ గాంధీ. మన దేశానికి సంబంధించిన తొలి డాక్యుమెంటరీస్ లో మహాత్ముడే ఎక్కువగా కనిపించారు. ఆ రోజుల్లో బ్రిటిష్ వారు మహాత్మ గాంధీ చేస్తున్న అహింసా పోరాటాలను నిక్షిప్తం చేయాలని భావించి, ఆ దిశగా డాక్యుమెంటరీలు రూపొందించారు. అలా నిక్షిప్త పరచిన మహాత్ముని దృశ్యాలనే ఈ నాటికీ చూడగలుగుతున్నాం. ముఖ్యంగా దండి వద్ద బాపూజీ చేసిన ఉప్పు సత్యాగ్రహం సమయంలో గాంధీజీపై చిత్రీకరించిన విజువల్స్ […]