ఒకే రోజున ఒకే హీరో నటించిన రెండు చిత్రాలు విడుదలయితే అది అభిమానులకు పెద్ద విశేషమే! అలాగే ఒకే రోజున ఒకే హీరోయిన్ నటించిన రెండు సినిమాలు కూడా పలుమార్లు విడుదలయ్యాయి. వాటినీ ముచ్చటించుకున్నాం. కానీ, ఒకే రోజున ఒకే దర్శకుని రెండు చిత్రాలు విడుదల కావడం వాటిలోనూ కొన్ని విశేషాలు చోటు చేసుకోవడం మరింత విశేషమే కదా! సరిగ్గా 35 సంవత్సరాల క్రితం అంటే 1986 అక్టోబర్ 2వ తేదీన ఆ ముచ్చట జరిగింది. ప్రముఖ […]
(అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య జయంతి) తెలుగునాట వెండితెరపై వేయి చిత్రాలలో వెలిగిన తొలి నటుడుగా అల్లు రామలింగయ్య చరిత్ర సృష్టించారు. సదరు చిత్రాలలో వేళ్ళ మీద లెక్కపెట్ట దగ్గవాటిని పక్కకు నెడితే, అన్నిటా అల్లువారి నవ్వులే విరబూశాయి. జనం మదిలో ఇల్లు కట్టుకొని మరీ గిల్లుతూ అల్లువారు నవ్వుల పంటలు పండించారు. గిల్లిన ప్రతీసారి మళ్ళీ మొలిచే పంటలవి. అజరామరమైనవి. తెలుగు చిత్రసీమలో అల్లు రామలింగయ్య హాస్యం ఏ తీరున ప్రత్యేకమైనదో, అదే విధంగా ఆయన […]
(అక్టోబర్ 1న రమణారెడ్డి శతజయంతి) కట్టెపుల్లకు బట్టలు తొడిగినట్టుగా ఉండే రూపంతో చూడగానే ఇట్టే నవ్వులు పూయించేవారు రమణారెడ్డి. క్షణాల్లో ముఖంలో అనేక భావాలు పలికించి రమణారెడ్డి నవ్వించిన తీరును తెలుగువారు మరచిపోలేరు. రమణారెడ్డి నటించిన చిత్రాలు ఇప్పటికీ బుల్లితెరపై దర్శనమిస్తూనే ఉంటాయి. ఆయన నటన చూసి నవతరం ప్రేక్షకులు సైతం పడి పడి నవ్వుతూ ఉండడం చూస్తూనే ఉంటాం. అదీ రమణారెడ్డి నవ్వుల మహాత్యం అనిపిస్తుంది. రమణారెడ్డి పూర్తి పేరు తిక్కవరపు వెంకటరమణారెడ్డి. 1921 అక్టోబర్ […]
(అక్టోబర్ 1న శివాజీ గణేశన్ జయంతి) అనేక విలక్షణమైన పాత్రలకు ప్రాణం పోసి, జనాన్ని విశేషంగా ఆకట్టుకున్న నటులు శివాజీ గణేశన్. తమిళనాట శివాజీ అభినయం భావితరాల వారికి పెద్దబాలశిక్షగా నిలచిందంటే అతిశయోక్తి కాదు. కమల్ హాసన్, శివకుమార్, జైశంకర్, విక్రమ్, సూర్య వంటి వారు తమకు శివాజీ గణేశన్ నటనే ఆదర్శం అంటూ పలుమార్లు నొక్కివక్కాణించారు. నేడు జనం చేత ‘ఉలగనాయగన్’ గా జేజేలు అందుకుంటున్న కమల్ హాసన్ “శివాజీగారి నటనలో పది శాతం చేయగలిగినా […]
టాలీవుడ్ యంగ్ హీరోల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో నేచురల్ స్టార్ నాని ఒకరు. అయితే మిడిల్ క్లాస్ అబ్బాయి తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేక పోయాడు నాని. ‘జెర్సీ’తో నటుడుగా విమర్శకుల ప్రశంసలు పొందినా… కమర్షియల్ గా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కొట్టలేక పోయాడు. ఆ తర్వాత వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’, ‘వి’, ‘టక్ జగదీశ్’ వరుసగా నిరాశ పరిచాయి. మధ్యలో నిర్మాతగా ‘హిట్’తో విజయం సాధించినా నటుడుగా మాత్రం సక్సెస్ […]
ఉప్పెన సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న మెగా హీరో వైష్ణవ్ తేజ్.. రెండో సినిమాను క్రిష్ దర్శకత్వంలో ‘కొండ పొలం’ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 8న థియేటర్లలో విడుదల కానుంది. వైష్ణవ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ‘కొండ పొలం’ అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. ఇక కొండపొలం ట్రైలర్, ఓబులమ్మ పాటకు భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశ..’ అంటూ సాగే మరో పాటను విడుదల […]
తెలుగు అకాడమీ నిధులు ఎక్కడి వెళ్లాయి.. ఎవరు దోచుకుపోయారు.. నాలుగు నెలల కాలంలో 63 కోట్ల రూపాయల నిధులు అదృశ్యమయ్యాయి.. ఈ నిధుల గోల్మాల్ వెనకాల ఉన్న అసలు సూత్రధారి ఎవరు.. ప్రైవేట్ కోపరేటివ్ బ్యాంకు పాత్ర ఎంత వరకు ఉంది.. యూనియన్ బ్యాంకు నుంచి డబ్బులు ఎలా డ్రా చేసుకున్నారు. ఉన్నతాధికారుల నకిలీ లెటర్స్ తో 63 కోట్ల రూపాయలు చీటర్ దోచుకున్నారు. అయితే కేసు వెనుక ఉన్న అసలు సూత్రధారి.. పాత్రధారి ఎవరు. కథను […]
నటుడు పోసాని ఇంటిపై దాడి చేసిన కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. నటుడు పోసాని ఇంటితోపాటు పక్కన ఉన్న సిసి కెమెరాలు పనిచేయడం లేదని పోలీసుల విచారణలో బయట పడింది. దాడి చేసిన వాళ్లని పట్టుకోవాలంటే సిసి కెమెరా ఫుటేజ్ తప్పనిసరైంది. అయితే పోలీసులు చెక్ చేయగా అతని ఇంటి చుట్టు పక్కల ఎక్కడ కూడా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని బయటపడింది. దీంతో పోలీసులు ఆ ఏరియా మొత్తంలో పనిచేస్తున్న సీసీ కెమెరాలు పైన […]
టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ భార్య పద్మ ఇటీవలే కన్నుమూశారు. కొన్నిరోజులుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె మరణించారు. ఇవాళ ఉత్తేజ్ భార్య పద్మ సంస్మరణ సభ హైదరాబాద్ ఫిలింనగర్ ఎఫ్ఎన్‌సీసీ క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఉత్తేజ్ కుటుంబసభ్యులతో పాటు ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ప్రముఖులు హాజరయ్యి ఉత్తేజ్‌ను ఓదార్చారు. ఉత్తేజ్ భార్య పద్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. చిరంజీవి, నాగబాబు, శ్రీకాంత్, మురళి మోహన్, రాజశేఖర్, హేమ, సీనియర్ దర్శకుడు శివనాగేశ్వరరావు సహా ఎంతో […]