(అక్టోబర్ 4న నిన్నే పెళ్ళాడతాకు 25 ఏళ్ళు) ప్రతిభను గౌరవించడం అన్నది నాటి అగ్రకథానాయకులు యన్టీఆర్, ఏయన్నార్ కు ఉండేది. వారి సొంత చిత్రాల ద్వారా ఎందరో ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించారు. అదే తీరున తరువాతి తరం హీరోలు కృష్ణ, కృష్ణంరాజు వంటివారు కూడా సాగారు. అక్కినేని నటవారసుడు నాగార్జున సైతం తాను నిర్మించిన చిత్రాల ద్వారా అనేకమందికి అవకాశాలు కల్పించి, చిత్రసీమలో వారు నిలదొక్కుకొనేలా చేశారు. దర్శకుడు కృష్ణవంశీ తొలి చిత్రం గులాబీ చూడగానే, నాగార్జున […]
(అక్టోబర్ 4న తమ్మారెడ్డి కృష్ణమూర్తి జయంతి) ఇంతింతై వటుడింతై అన్నచందాన తమ్మారెడ్డి కృష్ణమూర్తి చిత్రసీమలో ఒక్కోమెట్టూ ఎక్కుతూ అభిరుచి గల నిర్మాతగా నిలిచారు. ఆరంభంలో ప్రొడక్షన్ వ్యవహారాలు చూస్తూ తరువాత నిర్మాతగా మారి, తెలుగువారిని అలరించే చిత్రాలు తెరకెక్కించారు. తమ్మారెడ్డి కృష్ణమూర్తి నెలకొల్పిన ‘రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్’ పతాకంపై రూపొందిన చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. హైదరాబాద్ లో తెలుగు చిత్రపరిశ్రమ నెలకొనడానికి కృషి చేసిన వారిలో తమ్మారెడ్డి కృష్ణమూర్తి కూడా ఉన్నారు. కృష్ణమూర్తి చిత్రసీమకు చేసిన సేవలకు […]
(అక్టోబర్ 4న నటి సంఘవి పుట్టినరోజు) అందాలతో కనువిందు చేస్తూ, అభినయంతోనూ అలరించిన నటి సంఘవి. తమిళ, తెలుగు చిత్రాలతో ఓ వెలుగు వెలిగిన సంఘవి మత్తుగాచూస్తూ ప్రేక్షకులపై మత్తు చల్లి గమ్మత్తు చేసింది. దాంతోనే తనకంటూ కొంతమంది అభిమానులను సంపాదించుకుంది. సంఘవి అసలు పేరు కావ్య రమేశ్. 1977 అక్టోబర్ 4న మైసూరులో జన్మించింది. ఆమె తండ్రి రమేశ్ ఇ.ఎన్.టి. స్పెషలిస్ట్. మైసూర్ మెడికల్ కాలేజ్ లో ప్రొఫెసర్ గా పనిచేసేవారు. ప్రముఖ కన్నడ దర్శకులు […]
(అక్టోబర్ 4న ‘డాడీ’కి ఇరవై ఏళ్ళు పూర్తి) మెగాస్టార్ చిరంజీవికి 2001వ సంవత్సరం నిరాశ కలిగించిందనే చెప్పాలి. ఆ యేడాది ఆయన నటించిన ‘మృగరాజు’ చేదు అనుభవాన్ని మిగల్చగా, ‘శ్రీమంజునాథ’ కూడా ఆశించిన స్థాయిలో అలరించలేదు. అయితే ‘డాడీ’ చిత్రం మాత్రం నటునిగా ఆయనకు మంచి మార్కులు సంపాదించి పెట్టింది. ఈ చిత్రంలోనే అల్లు అర్జున్ తొలిసారి తెరపై నర్తిస్తూ కనిపించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ‘డాడీ’ చిత్రానికి సురేశ్ కృష్ణ దర్శకత్వం […]
బాలీవుడ్ హ్యాండ్ సమ్ హాంక్స్ హృతిక్ రోషన్, రణబీర్ కపూర్ కలయికలో సినిమా ఖాయం అని తేలింది. శనివారం వీరిద్దరూ ఓ నిర్మాతను కలిశారు. ఆ ఫోటోలు బయటకు రావటంతో వారిద్దరి కలయికపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కలయికలో ఓ మల్టీ స్టారర్ తెరకెక్కబోతున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. హృతిక్, రణబీర్ నమిత్ మల్హోత్రా కార్యాలయాన్ని సందర్శన వారు తీస్తున్న పురాణ కథ ‘రామాయణం’ కోసమే అని అందరూ నమ్ముతున్నారు. నమిత్, మధు మంతెన, […]
గాజువాకలో కరాటే చాంపియన్ షిప్ కార్యక్రమంలో పాల్గున్న సినీ హీరో సుమన్ మూవీ ఆర్టీస్ట్ అసోసియేషన్ ఎన్నికల పై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘మా ఎన్నికలలో ఎవరైన పోటీ చేయవచ్చు.. స్థానిక లేక స్థానికేతర అనడం కరెక్ట్ కాదు.. అవకాశం వచ్చినప్పుడు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఎక్కడైన కలిసి నటిస్తున్నాం.. అప్పుడు లేని స్థానిక అనే సమస్య ఇప్పుడు మాట్లాడటం సరికాదు.. ఎంతోమంది సీనియర్ ఆర్టీస్టులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.. బ్రతుకు తెరువు లేక ఇబ్బంది […]
బాలీవుడ్ నటి నేహా ధూపియా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నేహా భర్త, నటుడు అంగద్ బేడీ తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసాడు. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపాడు. రెండో బిడ్డకు జన్మనిచ్చిన నేహాకు ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 41 ఏళ్ల ఈ ముదురు బ్యూటీ 2018 లో తనకంటే చిన్నవాడైన నటుడు అంగద్ బేడీని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2018 లో ఈ దంపతులకి ఒక పాప పుట్టగా, […]
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు డ్రగ్స్, రేవ్ పార్టీ వ్యవహారంలో అదుపులోకి తీసుకున్నారు. ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్‌లో జరుగుతున్న రేవ్ పార్టీపై రెయిడ్ చేసిన అధికారులు ఆర్యన్ సహా మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆర్యన్ ఖాన్ ని కేవలం విచారణ కోసం మాత్రమే అదుపులోకి తీసుకున్నామని.. అతడిపై ఇంకా ఎలాంటి ఆరోపణలు, కేసు నమోదు కాలేదని ఎన్సీబీ అధికారులు […]
తెలుగు అకాడమీ కుంభకోణం కేసులో తెలుగు అకాడమీ, కెనరా బ్యాంక్ సిబ్బంది సీసీఎస్ ఉన్నతాధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. రఫిక్, రాజ్‌కుమార్‌ల సంబంధాలపై సీసీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తుల డిపాజిట్ ల గల్లంతుపై ప్రశ్నిస్తున్నారు.. యూనియన్, కెనరా బ్యాంక్ ల నుండి 8 కోట్ల ప్రైవేట్ డిపాజిట్ లను మస్తాన్ వలి & గ్యాంగ్ కాజేసింది. ఒక్కఒక్కరిగా తెలుగు అకాడమీ సిబ్బందిని సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. రఫీ, రాజ్ కుమార్ లతో జరిపిన లావాదేవీలపై […]
మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘లూసిఫర్’ చిత్రాన్ని తెలుగులో ‘గాడ్ ఫాదర్’ గా రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ సెట్స్ మీదకు రానున్న నేపథ్యంలో తాజాగా చిత్రానికి సంబంధించిన ఓ అప్‌డేట్ ను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ షేర్ చేశారు. ‘గాడ్ ఫాదర్’ మ్యూజిక్ సెషన్ ను తమన్ ఇదివరకే ప్రారంభించగా, తదుపరి ట్యూన్ అంశాలపై చర్చించారు. తాజాగా […]