బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ గత మూడేళ్ళుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. తను చివరగా కనిపించిన సినిమా ‘జీరో’. 2018లో ఈ సినిమా విడుదలైంది. అప్పటినుంచి అనుష్క ఏ కొత్త సినిమా అంగీకరించలేదు. 2020లో మాత్రం ఇండియన్ క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్ లో నటిస్తుందనే ప్రకటన వచ్చింది. సోనీ సంస్థ 2020లో ఈ ప్రాజెక్ట్ ప్రకటించి టైటిల్ రోల్లో అనుష్క నటిస్తారని చెప్పింది. అయితే ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో అందరూ ఈ సినిమా అటకెక్కినట్లే అని భావించారు. అయితే ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటోందని అది పూర్తి కాగానే దర్శకుడి ఎంపిక పూర్తి చేసి అనుష్కను కూడా సిద్ధం కమ్మని చెబుతారట. ఇటీవల అనుష్క వామిక అనే బేబీకి జన్మనిచ్చింది. భర్త విరాట్ కోహ్లితో కలసి విదేశీపర్యటనలో ఉంది. అయిత ఈ ఏడాది చివరలో జులన్ గోస్వామి బయోపిక్ సెట్స్ మీదకు వెళ్ళే ఆస్కారం ఉంది. ఇండియన్ ఉమెన్ క్రికెట్ చరిత్రలో జులన్ స్టార్ ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు ఉమెన్స్ వన్డేఇంటర్నేషనల్ చరిత్రలో ఎక్కువ వికెట్లు తీసిన క్రికెటర్ జులన్ కావటం విశేషం. ఈ ఫార్మేట్ లో 200 వికెట్స్ తీసిన తొలి బౌలర్ జులన్ గోస్వామినే.