‘కె.జి.యఫ్’ లాంటి ఒక్క సినిమాతో హోంబలే ఫిలింస్ బ్యానర్ అగ్రస్థాయి బ్యానర్ గా నిలిచింది. ఈ సంస్థలో వచ్చే సినిమాలన్నీ కూడా బడా సినిమాలే కావటం విశేషం. ప్రతి సినిమాని పాన్ ఇండియా లెవల్ లో ప్లాన్ చేస్తోంది. కాగా, కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ హీరోగా సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. లూసియా, యూ టర్న్ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు పవన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే తాజాగా ఈ చిత్రానికి టైటిల్ ఫిక్స్ తెలిసినట్టు తెలుస్తోంది. ‘ద్విత్వ’ అనే టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. ఈ కథలోని హీరో.. రెండు రకాలుగా ప్రవర్తిస్తాడట.. అందుకే ఈ చిత్రానికి ‘ద్విత్వ’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.