మలయాళ సూపర్‌హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికలుగా నిత్యామీనన్, ఐశ్వర్యరాజేశ్‌లు ఖరారు అయినట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. సెకండ్ వేవ్ కంటే ముందు శరవేగంగా సాగిన ఈ చిత్ర షూటింగ్.. ఆ తరువాత వాయిదా పడింది. కాగా అతిత్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అంతేకాదు, ఈ చిత్ర టైటిల్ ను కూడా అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ‘బిల్లా-రంగా’ టైటిల్ ప్రచారంలో ఉండగా.. మరో టైటిల్ పేరు టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రానికి “పరశురామ కృష్ణమూర్తి” అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. చిన్నపాటి వీడియో ద్వారా టైటిల్ అనౌన్స్ మెంట్ ఉండొచ్చునని సమాచారం. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నాడు.