నెల్లూరు జిల్లాలోని గూడూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుండి రాజమండ్రికి వెళ్తుండగా లారీ-కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులు వీరయ్య, వరలక్ష్మీ, మణికంఠ, స్వాతిలుగా ఉన్నారు. లిఖిత (16) అనే యువతికి తీవ్ర గాయాలు కాగా, నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. ఈ జాతీయ రహదారిపై కొంతకాలంగా బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది, దీంతో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందటంతో స్థానికంగా కలవరపెడుతోంది.