చకచకా సినిమాలు చేస్తూ హిందీ సినిమా రంగంలో యమ జోరు మీద ఉంది తాప్సీ పన్ను. ఇప్పటికే ఆమె ప్రధాన పాత్రలో పలు చిత్రాలు ప్రకటించారు. తాజాగా మరో సినిమాలో తాప్సీ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధం అవుతోంది. పైగా ఈ నెల 20వ తేదీ నుంచే సదరు సినిమా మొదలు పెట్టబోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ తరువాత తాప్సీ రష్యాలో వెకేషన్ కు వెళ్లింది. ఆమె కొంత గ్యాప్ తరువాత కెమెరా ముందుకు రాబోతోన్న సినిమా ఈ స్పానిష్ హారర్ రీమేకే కావటం విశేషం!
Read Also: డెబ్యూకి ముందే అడవి శేష్ మూవీకి ‘కోట్లాది రూపాయల’ క్రేజ్!
స్పానిష్ భాషలో సూపర్ హిట్టైన హారర్ థ్రిల్లర్ ‘జూలియాస్ ఐస్’. ఆ సినిమాని అధికారికంగా హిందీలో రీమేక్ చేయబోతున్నాడు ‘సెక్షన్ 375’ మూవీ డైరెక్టర్ అజయ్ బాల్. జూలై 20న మొదలు పెట్టి నెల రోజుల కాలంలో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయబోతున్న ఫిల్మ్ మేకర్స్ తాప్సీకి జోడీగా టాలెంటెడ్ యాక్టర్ గుల్షన్ దేవయ్యను ఎంపిక చేశారు. తాప్సీ, గుల్షన్ స్టారర్ స్పానిష్ రీమేక్ మన నేటివిటికి తగ్గట్టుగా మార్పులుచేర్పులతో వస్తోంది. దర్శకుడు అజయ్ బాల్ స్క్రిప్ట్ లో అనేక మార్పులు చేశాడట. ప్రధాన పాత్ర పోషిస్తోన్న తాప్సీ దృష్టి లోపం ఉన్న ఒక మహిళగా కనిపించబోతోంది. ఆమె తన సోదరి అనుమానాస్పద మృతికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తూంటుంది. ఆ క్రమంలో ఆమెకు ఎదురైన భయానక సంఘటనలు, సమస్యలే ‘జూలియాస్ ఐస్’ సినిమా!స్పానిష్ భాషలో రూపొందిన చిత్రం బాలీవుడ్ లో రీమేక్ కావటం… అందులో తాప్సీ నటించటం ఇదే మొదటి సారి కాదు. గతంలో ‘బద్లా’ సినిమాలోనూ అమితాబ్ తో కలసి నటించింది తాప్సీ. అది కూడా స్పానిష్ మూవీ ‘ద ఇన్విజిబుల్ గెస్ట్’ రీమేకే. ఇప్పుడు మరోసారి స్పానిష్ సినిమా రీమేక్ కు రెడీ అవుతోన్న టాలెంటెడ్ బ్యూటీ ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి…