విక్టరీ వెంకటేశ్ గారాల పట్టి ఆశ్రిత దగ్గుబాటి. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఆమె రికార్డ్ సృష్టించారు. వెంకటేశ్ పెద్ద కూతురైన ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ‘ఇన్ఫినిటీ ప్లాటర్’ పేరుతో ఓ అకౌంట్ రన్ చేస్తారు. దాంట్లో రెగ్యులర్ గా రుచికరమైన రెసిపీస్ పోస్ట్ చేస్తుంటారు. వాటి కోసం ఆశ్రితని ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా పెద్దదే! లక్షకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు దగ్గుబాటి వారి టాలెంటెడ్ షెఫ్ కి!
ఆశ్రిత ఇన్ స్టాగ్రామ్ లోని ‘రిచ్ లిస్ట్’లో 377వ స్థానం కైవసం చేసుకున్నారు. ఈ లిస్ట్ లో చోటు సంపాదించుకున్న వార్ని ‘ఇన్ ఫ్లుయెన్సర్స్’గా వ్యవహరిస్తారు. ఆశ్రిత కూడా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా నెటిజన్స్ పై ప్రత్యేకమైన ప్రభావం చూపుతున్నారని మనం భావించవచ్చు.
ఆశ్రిత పెళ్లి తరువాత భర్తతో కలసి ప్రస్తుతం ఫారిన్ కంట్రీలో ఉంటున్నారు. ఆమె ఇన్ స్టాగ్రామ్ జర్నీ మరింత సక్సెస్ ఫుల్ గా సాగాలని మనమూ కోరుకుందాం…