‘మా’ ఎన్నికల వివాదం ఈసారి నటి హేమ, కరాటే కల్యాణి వంతు వచ్చింది. ఇప్పటివరకు సైలెంట్ గా వీరిద్దరూ మరో చర్చకు తెరలేపారు. తాజాగా నటి హేమ తనను నరేష్, కరాటే కల్యాణి బెదిరిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది. హేమ మాట్లాడుతూ.. ‘నేను ఎవరినీ వ్యక్తిగతంగా ఒక్క మాట కూడా అనలేదు.. నాజోలికి వస్తే మాత్రం ఊరుకోను. నన్ను నరేష్, కరాటే కల్యాణి బెదిరిస్తున్నారు. నరేష్, కరాటే కల్యాణి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నారని’ హేమ తెలిపింది. ఈమేరకు హేమ […]
రాజ్ కుమార్ రావ్, కృతీసనన్ జంటగా నటించిన సినిమా ‘హమ్ దో హమారే దో’. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమా టీజర్ బుధవారం విడుదలైంది. అభిషేక్ జైన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 29న స్ట్రీమింగ్ చేయబోతున్నారు. గతంలో ‘స్త్రీ’, ‘లూకా చుప్పి, బాలా, మిమి’ చిత్రాలను నిర్మించిన మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ సంస్థ దీన్ని ప్రొడ్యూస్ చేసింది. ఈ చిత్రంలో పరేశ్ […]
మెగాప్రిన్స్‌గా ప్రేక్షకాభిమానులను మెప్పిస్తోన్న కథానాయకుడు వరుణ్‌తేజ్. అతను టైటిల్ పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం గని. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి గ్లింమ్స్ ఆఫ్ ‘గని’ ఫస్ట్ పంచ్ పేరుతో నలభై సెకన్స్ వీడియోను దర్శక నిర్మాతలు విడుదల చేశారు. బాక్సింగ్ బరిలో గాయాలపాలైన ‘గని’ తేరుకుని ఎదుటి వ్యక్తికి పంచ్ ఇవ్వడమే ఈ […]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై సీనియర్ నటుడు నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికల్లో సభ్యులకు డబ్బు ఆశ చూపించడం సరికాదని నాగబాబు అన్నారు. ఒక్కో ఓటరకు రూ. 10 వేలు ఇస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ డబ్బిస్తామని ఆశ చూపుతున్నారు. ప్రకాశ్‌రాజ్ మాకు మూడు సార్లు అధ్యక్షుడిగా ఉండాలి. ప్రకాశ్‌రాజ్ అధ్యక్షుడిగా ఎన్నికైతేనే మా బాగుపడుతుందన్నారు. కొందరు మంచు విష్ణు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విష్ణును గెలిపించాలనే కంగారు మీకెందుకు? […]
‘జాతి రత్నాలు’ వంటి మొదటి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది నటి ఫరియా.. చిట్టి పాత్రలో ఫరియా నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ మూవీ హిట్‌తో ఫరియాకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే పెరిగిపోయింది. మొదటి సినిమా తర్వాత చిట్టి ఏ సినిమాను అధికారికంగా ఒప్పుకోలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలతో బిజీగా వుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ అభిమానులకు రెగ్యులర్ టచ్ లో ఉంటుంది. ఈ క్రమంలో చిట్టి […]
‘మా’ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో పోటీదారుల విమర్శలతో ఇండస్ట్రీలో దుమారం రేగుతోంది. మంచు విష్ణు, మోహన్ బాబు కలిసి సీనియర్ల మద్దతు కూడగట్టుకునేందుకు చాలానే ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రకాష్ రాజ్ కు నాగబాబు మద్దతుతో మెగా అండదండలు ఉన్నాయి. తాజాగా నాగబాబు మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న ‘మా’ వివాదాలపై ఆయన స్పందించారు. నాగబాబు మాట్లాడుతూ.. ‘చిన్న, పెద్ద సినిమాలకు ప్రకాష్‌రాజ్ కావాలి. ఉత్తమ నటుడిగా ప్రకాష్‌రాజ్‌ను అంతా ఒప్పుకోవాల్సిందేనన్నారు. మంచు విష్ణును గెలిపించాలనే కంగారు ఎందుకు..? తెలుగు నటులు […]
నటుడు సీవీఎల్ నరసింహారావు మా అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.. నామినేషన్ విత్ డ్రా చేసుకున్నాక సీవీఎల్ తన మద్దతును మంచు ప్యానెల్ కు తెలిపాడు. అంతేకాదు, ప్రకాష్ రాజ్ ప్యానల్ పై సంచలన కామెంట్స్ చేశారు. ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఈ ఎన్నికల్లో తెలంగాణా బిడ్డలను గెలిపించాలని సీవీఎల్ కోరారు. విష్ణు ప్యానెల్ లో వున్న బాబు మోహన్, ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో వున్న ఉత్తేజ్ నీ గెలిపించండి. […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కటౌట్‌కు తగ్గట్టే కంటెంట్ సినిమాలను లైన్ లో పెట్టాడు. వరుస భారీ ప్రాజెక్ట్ సినిమాలతో ఈ స్టార్ హీరో ఉన్నంత బిజీగా ఇండియా వైడ్ గా ఎవరు లేరు. ఇప్పటికే ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉండగా.. అందులో రాధేశ్యామ్ ఒక్కటే పూర్తయ్యింది. సలార్, ఆదిపురుష్ సినిమాలు షూటింగ్ దశలో వున్నాయి. మరికొద్దిరోజుల్లోనే నాగ్ అశ్విన్ తో సినిమా ప్రారంభం కానుంది. ఇక ప్రభాస్ 25వ చిత్రం కూడా రేపు (అక్టోబర్ […]
ప్రముఖ దర్శక నిర్మాత రామానంద్ సాగర్ రూపొందించిన బుల్లితెర ధారావాహిక ‘రామాయణ్’ను ఎవరూ అంత తేలికగా మర్చిపోలేరు. అందులో కీలక పాత్రలు పోషించిన పలువురు నటీనటులు ఆ తర్వాత రాజకీయ జీవితంలోనూ ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఈ సీరియల్ లో రావణాసురుడి పాత్రకు ప్రాణం పోసిన అరవింద్ త్రివేది (82) మంగళవారం రాత్రి ముంబైలో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన మేనల్లుడు కౌస్తభ్ త్రివేది తెలియచేస్తూ, ‘కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ముందు గుండెపోటుకు గురయ్యారు, […]
ప్రముఖ కూచిపూడి నర్తకి సంధ్యారాజు నటిగా, నిర్మాతగా పరిచయం అవుతున్న చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దీనికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని రెండు పాటలను బాలకృష్ణ, వెంకటేశ్ ఇప్పటికే విడుదల చేయగా, తాజాగా వేణువులో చేరని గాలికి సంగీతం లేదు... అనే పాటను మాస్ మహారాజా రవితేజ రిలీజ్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. చెప్పారు. కరుణాకర్ అడిగర్ల సాహిత్యం అందించిన ఈ పాటకు శ్రవణ్ భరద్వాజ్ స్వరరచన చేశారు. అనురాగ్ కులకర్ణి శ్రావ్యంగా […]