మెగాప్రిన్స్‌గా ప్రేక్షకాభిమానులను మెప్పిస్తోన్న కథానాయకుడు వరుణ్‌తేజ్. అతను టైటిల్ పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం గని
. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి గ్లింమ్స్ ఆఫ్ ‘గని’ ఫస్ట్ పంచ్ పేరుతో నలభై సెకన్స్ వీడియోను దర్శక నిర్మాతలు విడుదల చేశారు. బాక్సింగ్ బరిలో గాయాలపాలైన ‘గని’ తేరుకుని ఎదుటి వ్యక్తికి పంచ్ ఇవ్వడమే ఈ గ్లిమ్స్ లో ఉంది. పనిలో పనిగా దీపావళి కానుకగా సినిమాను విడుదల చేస్తామని చెప్పిన నిర్మాతలు డిసెంబర్ 3వ తేదీని లాక్ చేశారు. ఈ బుల్లిటీజర్ లో రిలీజ్ డేట్ కూడా ఉండటం ఓ విశేషం.
”ఈ సినిమా కోసం వరుణ్‌తేజ్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారని, ఇటీవల ఆయన లుక్, ఎక్సర్‌సైజ్ ప్రోమోలకు ఫ్యాన్స్, ఆడియెన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింద’ని నిర్మాతలు తెలిపారు. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు హాలీవుడ్ చిత్రం ‘టైటాన్స్’, బాలీవుడ్ మూవీ ‘సుల్తాన్’ వంటి వాటికి యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్ వర్క్ చేశారు. సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.