మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై సీనియర్ నటుడు నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికల్లో సభ్యులకు డబ్బు ఆశ చూపించడం సరికాదని నాగబాబు అన్నారు. ఒక్కో ఓటరకు రూ. 10 వేలు ఇస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ డబ్బిస్తామని ఆశ చూపుతున్నారు. ప్రకాశ్‌రాజ్ మాకు మూడు సార్లు అధ్యక్షుడిగా ఉండాలి. ప్రకాశ్‌రాజ్ అధ్యక్షుడిగా ఎన్నికైతేనే మా బాగుపడుతుందన్నారు. కొందరు మంచు విష్ణు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విష్ణును గెలిపించాలనే కంగారు మీకెందుకు? అని నాగబాబు ప్రశ్నించారు. నరేష్ తుమ్మితే ప్రెస్ మీట్ దగ్గితే ప్రెస్ మీట్ ఎందుకు అలా చేస్తున్నారో అర్థంకావడం లేదు. ప్రకాశ్‌రాజ్‌ను గెలిపించేందుకు నూటికి నూరు శాతం శ్రమిస్తామని నాగబాబు తేల్చిచెప్పారు.
Read Also: మంచు విష్ణుకు అంత ఆత్రం ఎందుకు..? ప్రకాష్ రాజే గెలుస్తాడు: నాగబాబు