కింగ్ నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో హైరేంజ్ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర ఎల్ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్‌రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ లెంగ్తీ షెడ్యూల్‌లో నాగార్జున, గుల్ పనాంగ్, అనిఖా సురేంద్రన్ తదితరులపై కీలక సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ లొకేషన్‌లో నాగార్జున వర్కింగ్ […]
నవీన్ చంద్ర, అవికా గోర్ అన్నాచెల్లెళ్ళు గా నటించిన సినిమా ‘#BRO’. మ్యాంగో మాస్ మీడియా, శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ సమర్పణలో కార్తీక్ తుపురాణి దర్శకత్వంలో జె. జె. ఆర్. రవిచంద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని నవీన్ చంద్ర, అవికాగోర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటీవల రశ్మిక మందన్న ఆవిష్కరించింది. దీనికి మంచి అప్లాజ్ లభించిందని నిర్మాత రవిచంద్ తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్ తుపురాణి […]
ప్రముఖ కథ, మాటల రచయిత దివాకర బాబు మాడభూషి ‘చూడాలని వుంది, శుభలగ్నం, మావిచిగురు, యమలీల’ వంటి సుమారు వంద చిత్రాలకు పనిచేశారు. ఆయన కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించి పలు చిత్రాలు ఘన విజయాన్ని సాధించాయి. దివాకరబాబు తనకున్న అనుభవంతో రాసిన ‘ఒలికిపోయిన వెన్నెల’ నవలను సినీ మ్యాక్స్ లో ఇటీవల దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దివాకర బాబు మాట్లాడుతూ ”వెన్నెల చాలా హాయిగా, ఆహ్లాదకరంగా వుంటుంది. కానీ ఆ […]
బిగ్ స్క్రీన్ హంగామా మొదలైన రెండు వారాలు అవుతున్న ప్రేక్షకులు ఇంకా పూర్తిస్థాయిలో థియేటర్ల బాట పట్టలేకపోతున్నారు. తెలంగాణలో వంద శాతం ఆక్యుపెన్సీతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మల్టీప్లెక్సులు ఓపెన్ అయ్యాయి. ఏపీలోనూ దాదాపుగా అన్ని పర్మిషన్స్ ఉన్న కొన్ని చోట్ల థియేటర్స్ ఓపెన్ కానీ పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాలు లేకున్నాను, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు థియేటర్లో నడుస్తున్న ప్రేక్షకులు థియేటర్ల వైపు చూడలేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఇప్పటివరకు విడుదలైన […]
కరీంనగర్ కి చెందిన బీజేపీ నాయకుడు, న్యాయవాది భేతి మహేందర్ రెడ్డిపై మంత్రి గంగుల కమలాకర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనకు గ్రానైట్ సంస్థల్లో ఎలాంటి భాగస్వామ్యం లేకున్నా అసత్య ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వ్యక్తిగత రాజకీయ పరువుకు నష్టం కలిగించేలా మహేందర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్ 152 ఏ, 505 (ii) నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని […]
టాలీవుడ్ చందమామ ప్రధాన పాత్రలో నటిస్తున్న హిందీ చిత్రం ‘ఉమ’.. ఈ చిత్రంతో తథాగతా సింఘా దర్శకుడిగా పరిచయవుతున్నారు. అవికేష్ ఘోష్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా పాత్రలను పరిచయం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని కోల్‌కతాలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేశారు. ‘ఉమ’ చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా కాజల్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమాలో నటించడం ఓ అందమైన అనుభవం.. ఈ […]
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన ఇట్టే వైరల్ అయిపోతుందంటే అర్ధం చేసుకోవచ్చు ఈ చిత్రంపై అభిమానులు ఎన్ని ఆశలు పెట్టుకొన్నారనేది..! ఇక రాజమౌళి సినిమాలు కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రెండు రేట్లు ఎక్కువే ఉంటుందని ఆయన గత సినిమాలు చూసి చెప్పొచ్చు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాకిగానూ అదే హామీ ఇస్తున్నారు […]
అమరావతి ఐకాస రేపు చేపట్టిన ర్యాలీకి అనుమతి లేదని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ తెలిపారు. రాజధాని రైతుల ఉద్యమం 600 రోజులకు చేరిన సందర్భంగా అమరావతి ఐకాస రేపు తలపెట్టారు. అదే సమయంలో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ర్యాలీకి సిద్ధమయ్యారు. కాగా కొవిడ్ దృష్ట్యా ర్యాలికి అనుమతి సాధ్యం కాదని డీఐజీ తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం అనుమతులు సాధ్యం కాదని చెప్పుకొచ్చారు. 50 మంది కంటే […]
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీసు సమీపంలో ఎస్. ఆర్ ఎనక్లేవ్ అపార్ట్మెంట్ లో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ముందు భార్యను హత్య చేసిన తరువాత భర్త ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు నడింపల్లి నరసింహారాజు, వెంకటమనమ్మగా పోలీసులు గుర్తించారు. భర్త నిడదవోలులో టీచర్ గా పనిచేస్తుండగా, భార్య ఉమెన్స్ కాలేజ్ లో కాంట్రాక్ట్ లెక్చరర్ గా చేస్తుంది. కాగా, వీరి మృతికి కుటుంబ కలహాలే కారణంగా త్రీటౌన్ పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు […]