టాలీవుడ్ చందమామ ప్రధాన పాత్రలో నటిస్తున్న హిందీ చిత్రం ‘ఉమ’.. ఈ చిత్రంతో తథాగతా సింఘా దర్శకుడిగా పరిచయవుతున్నారు. అవికేష్ ఘోష్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా పాత్రలను పరిచయం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని కోల్‌కతాలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేశారు. ‘ఉమ’ చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా కాజల్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమాలో నటించడం ఓ అందమైన అనుభవం.. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతిఒక్కరు అద్భుతం. ఉమ అయితే నన్ను ఓ అందమైన అనుభూతిలో పడేసింది అని కాజల్ ఇన్‌స్టాగ్రామ్ స్టాటస్‌లో తెలిపింది. త్వరలోనే విడుదల తేదిని ప్రకటించనున్నారు.