కరీంనగర్ కి చెందిన బీజేపీ నాయకుడు, న్యాయవాది భేతి మహేందర్ రెడ్డిపై మంత్రి గంగుల కమలాకర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనకు గ్రానైట్ సంస్థల్లో ఎలాంటి భాగస్వామ్యం లేకున్నా అసత్య ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వ్యక్తిగత రాజకీయ పరువుకు నష్టం కలిగించేలా మహేందర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్ 152 ఏ, 505 (ii) నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని మంత్రి గంగుల పోలీసులను కోరారు. మంత్రి ఫిర్యాదుపై స్పందించిన టూ టౌన్ పోలీసులు భేతి మహేందర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.