తెలంగాణ సర్కారుకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అభినందనలు తెలపడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఏం సాధించిందని కాంగ్రెస్ సర్కారుకు శుభాభినందనలను చెప్తున్నాడో రాహుల్ గాంధీ..? అంటూ ప్రశ్నించారు. దేనికి భేష్.. దేనికి శభాష్ అంటూ రాహుల్ ను ప్రశ్నిస్తూ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు. మహాలక్ష్మిని మాయ చేసినందుకా భేష్.. మహిళలు సిగలు పట్టుకుని కొట్టుకునే అరాచక పరిస్థితికి శభాష్.. చెబుతున్నారా అంటూ ప్రశ్నస్త్రాలు సంధించారు.
Read Also: Vizag New Year Celebrations: న్యూ ఇయర్ వేడుకలు.. గైడ్‌లైన్స్ విడుదల చేసిన వైజాగ్ సీపీ
రైతు భరోసా వాయిదాల దిశ అయినందుకు భేష్.. రైతుల చేతికి సంకెళ్లేసినందుకు శభాష్ అంటున్నారా అని ఎద్దేవా చేశారు. విద్యాభరోసా కార్డు ఊసే ఎత్తనందుకు భేష్.. విద్యార్థులకు పురుగులన్నం పెడుతున్నందుకు శభాష్ చెబుతున్నారా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్లు ఇంకా రానందుకు భేష్.. ఉన్న ఇండ్లు కూలగొడుతున్నందుకు శభాష్ చెబుతున్నారా అంటూ నిలదీశారు. చేయూతగా రూ.4000 ఫించను అందనందుకు భేష్.. ఇచ్చే ఫించన్లు కూడా ఆలస్యం చేస్తూ ఏడిపిస్తున్నందుకు శభాష్ అంటూ ప్రశ్నించారు. అభివృద్ధి ఆశ లేదు.. సంక్షేమం ఊసు లేదు.. పనికొచ్చే పని లేదు.. పనికిమాలిన డైవర్షన్ పాలిటిక్స్‌కు అడ్డులేదు అంటూ కాంగ్రెస్ పాలనపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు.
దేనికి భేష్❓
దేనికి శభాష్❓"మహాలక్ష్మి" మాయ చేసినందుకు భేష్ ❓
మహిళలు సిగలు పట్టుకుని కొట్టుకునే అరాచక పరిస్థితికి శభాష్❓"రైతు భరోసా" వాయిదాల దిశ అయినందుకు భేష్❓
రైతుల చేతికి సంకెళ్లేసినందుకు శభాష్ ❓"విద్యాభరోసా కార్డు" ఊసే ఎత్తనందుకు భేష్ ❓
విద్యార్థులకు… pic.twitter.com/VA2gYnFiRN— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) December 26, 2024
Read Also: Satish Wagh: వీడిన బీజేపీ ఎమ్మెల్సీ యోగేష్ మామ సతీష్ హత్య మిస్టరీ.. చంపించింది ఎవరంటే..!