ఈనెల 30న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగనుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కి సభ సంతాపం తెలపనుంది. ఈ క్రమంలో సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. సంతాప దినాల్లో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు శాసన సభ నివాళులు అర్పించనుంది.
Read Also: AP DGP: మన దేశంలో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.. భారత దేశానికి 10 ఏళ్ల పాటు ప్రధానిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు వయసు 92 ఏళ్లు. ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇతర నేతలు, బంధువులు ఆయనకు నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో సిక్కు సంప్రదాయాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
Read Also: Tammareddy : సీనియర్లు మాటలు వినే పరిస్థితి లేదు.. కుర్ర హీరోలకు కోటరీలు ఉంటున్నాయి
ఈనెల 9న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై 21వ తేదీ వరకు కొనసాగాయి. మధ్యలో కొన్ని రోజులకు సమావేశాలు జరగలేదు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పలు కీలక చర్చలపై చర్చ జరిగింది. అంతేకాకుండా పలు బిల్లులకు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే..