HYDRA: హైడ్రా కమిషనర్ కీలక ప్రకటన.. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు..!
- హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన
- త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సిద్ధం అవుతున్నాం- రంగనాథ్
- 2 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధిలో హైడ్రా పని చేస్తుంది- రంగనాథ్
- హైడ్రా కు చైర్మన్ గా ముఖ్యమంత్రి ఉంటారు- హైడ్రా కమిషనర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సిద్ధం అవుతున్నామని తెలిపారు. హైడ్రాకు చైర్మన్‌గా ముఖ్యమంత్రి ఉంటారని వెల్లడించారు. 2 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధిలో హైడ్రా పని చేస్తుంది.. తమ పరిధిలో 1025 చెరువులను గుర్తించామని రంగనాథ్ పేర్కొన్నారు. సర్వే ఆఫ్ ఇండియా నుండి ఇమేజ్ రికార్డులు సేకరించాము.. శాటిలైట్ ఆధారంగా సేకరించిన డేటా కూడా తమ వద్ద ఉందని తెలిపారు. చెరువులు నింపి ఎఫ్టీఎల్ (FTL) పరిధి మార్చినా కూడా.. వాటిని గుర్తించేందుకు పని చేస్తున్నామన్నారు. అలాగే.. శాటిలైట్ ఏజెన్సీలతో కూడా సమావేశం అవుతున్నాం.. సమూహంగా ఇచ్చే ఫిర్యాదులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
Congress: మన్మోహన్ సింగ్ మరణంపై బీజేపీ రాజకీయం.. సిద్ధూ విమర్శలు..
Also Read
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గతంలో ఎలా ఉండేది అనేది గుర్తిస్తున్నామని హైడ్రా కమిషనర్ తెలిపారు. హైడ్రా కేవలం డిమాలేషన్ కోసమే అన్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. హైడ్రా చెరువులు పునరుద్ధరణ చేస్తుందని త్వరలోనే నిరూపిస్తామని అన్నారు. మరోవైపు 72 డీఆర్ఎఫ్ టీమ్‌లు అందుబాటులోకి రాబోతున్నాయి.. చెట్లు పడిపోవడం, నీళ్ళు నిలవడం, ఫైర్ ఆక్సిడెంట్లపై డీఆర్ఎఫ్ పని చేస్తుందన్నారు. త్వరలో తమకు వెదర్ రాడార్ రాబోతుంది.. అంతేకాకుండా హైడ్రా కోసం ఒక FM ఛానెల్ పెట్టాలని ఆలోచన చేస్తున్నామని రంగనాథ్ తెలిపారు. ఇదిలా ఉంటే.. నోటరీ ఉన్న వాటిని కొనెప్పుడు ప్రజలు ఆలోచించాలి.. రెండు మూడు రకాలుగా వెరిఫై చేసి కొనాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Legally Veer : లీగల్లీ వీర్ ముఖ్య ఉద్దేశం అదే : హీరో వీర్ రెడ్డి
అనుమతి లేని నిర్మాణాల్లో బిజినెస్ చేసేవాళ్ళు.. నోటీస్ ఇచ్చిన వెంటనే ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇళ్ళు, ప్లాట్స్ కొనే వారి కోసం.. బఫర్, FTLలో ఉన్నాయా లేవా చెప్పేందుకు హైడ్రా ఒక వెబ్ సైట్ ఏర్పాటు చేస్తామన్నారు. జూలై 19కు ముందు కట్టిన వాటిని హైడ్రా కూల్చదు.. పర్మిషన్ లేకుంటే కూల్చివేస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు 200 ఎకరాలు హైడ్రా కాపాడింది.. 2025లో 12 చెరువులు హైడ్రా సుందరీకరించాలని టార్గెట్ పెట్టుకుందని రంగనాథ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు.. ల్యాండ్ గ్రబ్బర్స్, ల్యాండ్ మాఫీయా వాళ్లు హైడ్రాను వ్యతిరేకిస్తున్నారు.. ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా హైడ్రా వైపు చూస్తున్నారు.. ప్రజలు, చదువుకున్న వాళ్ళు హైడ్రా వైపు వస్తున్నారని అన్నారు. సామాన్యులను ఇబ్బందిపెట్టే ఉద్దేశం హైడ్రాకు లేదని తేల్చి చెప్పారు. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ ఎక్కడా దెబ్బ తినడం లేదని హైడ్రా కమిషనర్ చెప్పారు.
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!