Health Tips: మీరు ప్లాస్టిక్ వాడుతున్నారా.. చాలా డేంజర్ గురూ.. ప్లాస్టిక్ బాక్స్ ల్లో ఫుడ్, ప్లాస్టిక్ బాటిల్స్ వాటర్, ప్లాస్టిక్ కవర్స్ లో ఇతరత్రా వస్తువులు తీసుకుని వెళ్తున్నారా.. ప్రమాదం బారిన పడినట్టేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్లాస్టిక్ వాడొద్దని నిపుణులు చెబుతున్నప్పటికీ జనాలు పెడచెవిన పెడుతున్నారు. అసలు ప్లాస్టిక్ వాడితే ఆరోగ్యానికి హానికరమని కొంతమందికి ఇంకా తెలియదు. కనుక ప్లాస్టిక్ వస్తువుల వాడకం వల్ల ఎన్నో ప్రమాదకరమైన రోగాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Read Also: Adipurush Pre Release Event LIVE : ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా..
పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రతి ఏడాది జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘ప్లాస్టిక్ పొల్యూషన్ సొల్యూషన్స్’ థీమ్ ను ఏర్పాటు చేశారు. జనాల్లో ప్లాస్టిక్ వాడకం ఎక్కువవుతుందని.. దాన్ని నిర్మూలించడానికై ఈ థీమ్ ను పెట్టారు. మన చుట్టూ, ప్రతి ఇంట్లో ప్లాస్టిక్ ను విచ్చల విడిగా ఉపయోగిస్తున్నారు. నీరు తాగడాని కోసం ఉపయోగించే బాటిళ్లలో బిస్ఫెనాల్ ఎ (బిపిఏ) అనే రసాయన సమ్మేళనాన్ని ఉపయోగిస్తారు. పాలికార్బోనేట్ ప్లాస్టిక్ తయారీకి బీపీఏను ఉపయోగిస్తారు. దీని వాడకం వల్ల క్యాన్సర్, హార్మోన్ల సమస్యల ప్రమాదం పెరుగుతుంది. అందుకే ప్లాస్టిక్ కంటైనర్ లను అస్సలు ఉపయోగించకూడదు.
Read Also: SBI Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..రూ.75 లక్షల జీతం..
ఇంట్లో కూరగాయలను కట్ చేయడానికి ప్లాస్టిక్ చాపింగ్ బోర్డును ఉపయోగిస్తారు. నిజానికి ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులో ఉండే హానికారక పదార్థాలు ఆహారంలో కలిసిపోతాయి. దీనివల్ల ఎన్నో రోగాలు వస్తాయి. అంతేకాదు కొన్ని రకాల బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది. ఇది ఉదర సంబంధిత వ్యాధులను పెంచుతుంది. అందుకే ప్లాస్టిక్ కాకుండా చెక్క లేదా రాతి చాపింగ్ బోర్డును ఉపయోగించండి. మరోవైపు ఇండ్లలో ప్లాస్టిక్ టిఫిన్ల వాడకం బాగా పెరిగింది. వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ లో ఉంచడం వల్ల హానికరమైన పదార్థాలు ఆహారంలో కరిగిపోతాయి. ఇది మూత్రపిండాలు, కాలేయానికి సంబంధించిన ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులకు కారణమవుతుంది. అందుకే ప్లాస్టిక్ టిఫిన్లకు బదులుగా స్టీల్ లేదా గ్లాస్ టిఫిన్లను వాడుతున్నారు.