TTD Employees: టీటీడీలో భారీగా ఉద్యోగుల పదవీ విరమణ.. కీలక విభాగాల్లో సిబ్బంది కొరత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD Employees Retirement: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో శాశ్వత ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం (జులై 31) ఒక్కరోజే టీటీడీలో 37 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఇప్పటికే పలు కీలక విభాగాల్లో ఉన్న సిబ్బంది కొరత మరింత తీవ్రమయ్యే పరిస్థితి ఏర్పడింది. టీటీడీలో ఖాళీగా ఉన్న శాశ్వత ఉద్యోగాల భర్తీపై అధికారులు పెద్దగా దృష్టి సారించకపోవడంతో.. అనేక విభాగాలు ప్రస్తుతం అవుట్సోర్సింగ్ సిబ్బందితోనే కొనసాగుతున్నాయి. రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య తగ్గుతుండటం వల్ల పరిపాలనా వ్యవస్థపై అదనపు భారం పడుతున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా టీటీడీలో అత్యంత కీలకమైన ఆప్రైజర్ (నగల విలువ నిర్ధారణ అధికారులు) విభాగంలో సిబ్బంది కొరత తీవ్రంగా కనిపిస్తోంది. ఒకేసారి 11 మంది ఆప్రైజర్లు పదవీ విరమణ చేయడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో విధుల్లో అంతరాయం కలగకుండా ఉండేందుకు, ఈరోజు పదవీ విరమణ పొందుతున్న ఓ ఆప్రైజర్ను తాత్కాలికంగా కొనసాగించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. టీటీడీ పరిధిలోని 63 ఆలయాల్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాల తనిఖీ, విలువ నిర్ధారణ, భద్రతా ప్రక్రియల్లో ఆప్రైజర్ల పాత్ర అత్యంత కీలకమైనది. ఈ నేపథ్యంలో ఆ విభాగంలో అనుభవజ్ఞులైన సిబ్బంది కొరత ఏర్పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. శాశ్వత ఉద్యోగుల నియామకాలపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించి.. ఖాళీలను త్వరగా భర్తీ చేయాలని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!