Nizamabad: తెలంగాణ యూనివర్సిటీలో ఈసీ వర్సెస్ వీసీ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్, ఏసీబీ దాడులు నిర్వహించారు. యూనివర్సిటీలో గత కొంత కాలంగా అక్రమాలపై ఆరోపణలు వస్తున్న.. నేపథ్యంలో రైడ్స్ చేశారు అధికారులు. అటు అకౌంట్ సెక్షన్, ఎస్టాబ్లిష్ మెంట్ సెక్షన్, బిల్డింగ్ సెక్షన్, ఏవో కార్యాలయంలో సోదాలు చేసి.. పలు ఫైళ్లను అధికారులు పరిశీలించారు. యూనివర్సిటీలో అక్రమ నియామకాలు, అక్రమ లావాదేవీలు జరిగాయని ఈసీ చర్యలకు దిగింది.
Read Also: Anupama Parameswaran: అందుకే అనుపమ అలాంటి పని చేస్తుందా?
అంతేకాకుండా వీసీ అక్రమాలకు పాల్పడ్డారంటూ రిజిస్ట్రార్ ను మారుస్తున్నామని ఈసీ ప్రకటించింది. దీంతో కొత్త రిజిస్ట్రార్ ను నియమిస్తూ వీసీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో యూనివర్సిటీలో పాలన గందరగోళంగా మారింది. దీంతో ఈసీ సభ్యులకు వీసీకి మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీలో ఏసీబీ దాడులు మరోసారి కలకలం రేపుతున్నాయి.
ఈసీ వర్సెస్ వీసీ మధ్య గొడవలు కాస్త విద్యార్థుల జీవితాలను నాశనం చేసేలా చేస్తున్నాయి. కొన్ని రోజులు ప్రశాంతంగా.. కొన్ని రోజులు గొడవలతో యూనివర్సిటీ అట్టుడికిపోతుంది. చూడాలీ మరీ వీరి గొడవలకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో.